Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

హామీలను విస్మరించిన కెసిఆర్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ 

CPI-leaders

పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి 

మనతెలంగాణ/కాశిబుగ్గ: పత్తి రైతులకు గిట్టు బాటు ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభు త్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఏను మాముల వ్యవసాయ మార్కెట్‌ను సిపిఐ నాయ కులు బృందం సందర్శించి పత్తి రైతులతో మాట్లాడి గిట్టుబాటు ధరల విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్య దర్శి పి.నిర్మలను కలిసి పత్తి రైతుల గిట్టుబాటు ధరల పలు సమస్యలపై చర్చించారు. ఈ సంద ర్భంగా మార్కెట్‌లోని ప్రధాన కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీలను ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయకుండా గారడీ మాటలు మాట్లాడు తూ రాష్ట్రంలోని రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే దళితుడిని సిఎం చేస్తానని హామీనిచ్చి తుంగలో తొక్కడమేకాక ఉపముఖ్యమంత్రి పద వి నుంచి దళితుడిని అవమానించేరీతిలో తీసివే యడం దారుణమన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు ఇలా అనేక అబద్దాలను చెబుతున్నారు తప్ప మూడున్నరేళ్లలో చేసిందింలేదన్నారు. ఏను మాముల మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.2,500లనుంచి రూ.4వేల వరకు మార్కె ట్లోని వ్యాపారస్తులు ధర నిర్ణయిస్తున్నారు. అయితే మార్కెట్‌కు వచ్చిన రైతులు పత్తిని తిరిగి ఇంటికి తీసుకపోలేక సగానికి సగం ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏనుమాముల మార్కె ట్లో ఉందని అన్నారు. మార్కెట్లో ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రం పేరుకే తప్ప రైతుల వద్ద నుంచి ఇంత వరకు సరైన పత్తి కొనుగోళ్లు చేయలేదని ఆరోపించారు.
మార్కెట్లోని వ్యాపారస్తులు నిర్ణయించిన ధరలకే పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏనుమాముల మార్కెట్‌కు వస్తే సిఎం కేసిఆర్‌కు, రాష్ట్ర మార్కె టింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావులకు తెలిస్తుందని అన్నారు.

ఇప్పటికైనా కెసిఆర్ సిసిఐతో మార్కెట్‌కు వచ్చే ప్రతి ఒక్కరి పత్తిని కొనుగోళ్లు చేయించాలి. అదే విధంగా క్వింటాల్ పత్తికి బోనస్ పద్ధతిలో పత్తి రైతులకు చెల్లించాల్సిన అవసరం రాష్ట్రప్రభు త్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాల మల్లేశ్, పద్మ, ఎండి యూసుఫ్, సాయిలు, ఉస్తేల సృజన్, పాండురంగాచారి, రాములు, రమావత్, లక్ష్మినారాయణ, నరసింహా, శ్రావణి, తక్కలపెల్లి శ్రీనివాస్‌రావు, సిరగోయిన కరుణాకర్, ఎస్‌కె బాష్‌మియా, దామోర కృష్ణ, బుస్స రవి, అశోక్, సిపిఐ పార్టీ నాయకులు, నాయకురాలు, రైతులు, అధికారులు తదితరులు ఉన్నారు.

Comments

comments