Search
Wednesday 22 November 2017
  • :
  • :

డిసెంబర్ 29న ‘ఛలో’

Challo

ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీరావే మా ఇంటికి, కళ్యాణ వైభోగం, జ్యోఅచ్యుతానంద వంటి విభిన్న కథా చిత్రాలతో మంచి విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. ప్రస్తుతం  వెంకి కుడుముల దర్శకత్వంలో ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రానికి ‘ఛలో’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నాగశౌర్య తల్లిదండ్రులైన నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.1గా నిర్మిస్తున్నారు. ఇక ‘ఛలో’ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగశౌర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. కాగా డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ‘ఛలో’ను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ “ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రంగా నాగశౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మేము నిర్మిస్తున్న చిత్రానికి ‘ఛలో’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉంది. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. దర్శకుడు వెంకీ మంచి కథను కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారు. నాగశౌర్య తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తాడు. ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్ 18న రిలీజ్ చేసి… డిసెంబర్ 29న సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తాం”అని అన్నారు. దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ “నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా ఇదవుతుంది. అతను సినిమాలో అద్భుతంగా నటించాడు.  ఆంధ్ర, తమిళనాడు బార్డర్‌లో జరిగే కాలేజీ లవ్ స్టోరీ ఇది. ‘ఛలో’ చిత్రం టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కిరాక్’ చిత్రంతో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆమె మా చిత్రంలో తన గ్లామరస్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ఏవిధంగా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు”అని చెప్పారు. చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ “మా ప్రొడక్షన్‌లో వస్తున్న మొదటి చిత్రం ‘ఛలో’ టైటిల్‌కు ఎంత స్పందన వచ్చిందో డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్న టీజర్‌కు సైతం అంతే స్పందన వస్తుందని నమ్ముతున్నాం. దర్శకుడు వెంకి కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి”అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సాయి శ్రీరామ్, సంగీతంః సాగర్ మహతి.

Comments

comments