Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

బయోమెట్రిక్‌తో అవినీతికి చెక్

nzb1

రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు

నిజామాబాద్:నవంబర్ మాసం రేషన్ సరుకులు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌ల ద్వారా పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. సరుకుల పంపిణీలో బియ్యం అధికంగా పక్కదారి పడుతుందని ప్రభు త్వం గత కొంత కాలంగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీన్లో భాగం గా రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధా నం ప్రవేశపెట్టడంతో సరుకులు సక్రమంగా ప్రజలకు చేరుతుండటంతో ఇతర జిల్లాలకు విస్తరిం చడంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నిజామాబాద్ జిల్లాకు కావాల్సిన 751 ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని అన్ని రేషన్ షాపులలో వాటిని అమర్చి బయోమెట్రిక్ యంత్రాలను అనుసంధానం చేసి వినియోగదారులకు కావాల్సిన బియ్యం, చక్కెర, గోధుమలు పంపిణీ చేయనున్నారు. ఈ విధానం వలన పూర్తి పారదర్శకత ఉంటుందని, బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా నిరోధించవచ్చని, బోగస్ రేషన్‌కార్డులు బయట పడతాయని, గతంలో మాదిరిగా అవకతవకలు జరగవని, ప్రజలకు పూర్తిస్థాయిలో పారదర్శకతతో ప్రజాపంపిణీ ఉండనుంది. ప్రస్తుతం బియ్యం సరఫరా పూర్తిస్థాయిలో జరుగుతున్న చక్కెర 1కేజి, కిరోసిన్ 1లేదా 2 లీటర్లు మాత్రమే పంపిణీ జరుగుతున్నాయి. గోధుమల పంపిణీ నిజామాబాద్‌లో మాత్రమే జరుగుతుంది. చౌకధరల దుకాణాల యాజమానులు, నవంబర్ నెల సరుకులు పంపిణీ చేస్తారని, త్వరలోనే సిఎంతో ఏర్పాటయ్యే సమావేశంలో వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం క్వింటాలుకు 20 రూపాయల చొప్పున కమిషన్‌గా చెల్లిస్తున్నారు. పుడ్‌సెక్యూరిటీ చట్టం ప్రకారం తమకు క్వింటాలుకు 70 రూపాయలు చెల్లించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
జాతీయ పుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం కేంద్రం ఏనబై శాతం, – రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం చెల్లించాల్సి ఉంది. ఆ విధంగానే చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై డిఎస్‌ఒను సంప్రదించగా అక్రమాలకు తావు లేకుండా ప్రజా పంపిణీ జరిపించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖపై ఉందని, అందుకే 3 నెలలుగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు.

Comments

comments