Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

బాల కార్మికులు పని ప్రదేశాల్లో ఉండకూడదు

door
జిల్లా కలెక్టర్ శరత్
మనతెలంగాణ/ జగిత్యాల: పని ప్రదేశాల్లో బాల కార్మికుల ఉండరాదని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు ఎప్పటికప్పు డు తనిఖీలు నిర్వహించి తనిఖీ నివేదికను ప్రతి 15 రోజులకు ఒక సారి సమర్పించాలని ఆదేశించారు. బాల కార్మికులు ఎక్కువగా హోటళ్లలో, క్వారీల్లో, భవన నిర్మాణ రంగంలో ఉంటారని ఆయా ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి తగు చర్యలు చేపట్టాలన్నారు. క్వారీలు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ ప్రదేశాల వద్ద వర్క్‌సైడ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి 104 మంది పిల్లలను గుర్తించి నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండల విద్యాధికారులు పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలు, విద్యార్థులు, గ్రామాల వారీగా గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రత్యేక తరగతులు, డిజిటల్ తరగతుల కార్యచరణ రూపొందించాలన్నారు.

Comments

comments