Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

గోదావరి జలాలతో సిరుల పంట

mike

*చౌటుప్పల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాలువ భూసేకరణ పరిహారం పంపిణీ

మన తెలంగాణ/చౌటుప్పల్ ః సమైక్య రాష్ట్రంలో నత్తనడకన నడిచే సాగునీటి ప్రాజె క్టులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసిందని మునుగోడు శాసనసభ్యుడు కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్‌డిఒ కార్యాల యం ఆవరణలో శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల, కుంట్లగూడెం, పంతంగి, జై-కేసారం, స్వాములవారి లింగో టం, లింగోజీగూడెం గ్రామాలకు చెందిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లా డుతూ కొంత మంది రైతుల త్యాగాల వల్లే ఈ ప్రాంతానికి కాళేశ్వరం ప్రధాన కాలువ నిర్మా ణానికి అవకాశం ఏర్పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఈ ప్రాంతంలోని వివిధ గ్రామాలలో నేరుగా 6847 ఎకరాల బీడు భూములు సస్యశ్యా మలం అవుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి జలాలతో రైతుల పంటపొలాలు పచ్చని పంటపొలాలుగా మారబోతున్నాయని తెలిపారు. కాళేశ్వ రం ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి ప్రభుత్వం రూ. 4.50 లక్షలు నిర్ణయిస్తే తాను ఆ పరిహారాన్ని కాస్తా రూ. 6 లక్షల 75 వేలకు పెంచేలా కృషి చేసి రైతులకు అండగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. కాళేశ్వరం ప్రధాన కాలువ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. విపక్షాలు తమ ఉనికి కోసం ప్రాజెక్టులపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం పంపిణీ విషయంలో రైతులు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పరిహారం అందేది కాదన్నారు. తమ ప్రభుత్వంలో కనీసం రెవిన్యూ టికెట్టు ఖర్చుకూడా లేకుండా కేవలం 15 రోజుల్లోనే నిర్వాసితులకు నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా రూ. 1, 31,92,035 ల విలువైన చెక్కును అందజేశారు. సదరు పరిహారం డబ్బు 48 గంటల లోపు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ హైమద్‌ఖాన్, స్థానిక ఆర్‌డిఒ ఎస్. సూరజ్‌కుమార్, జెడ్పిటిసి సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచి బొంగు లావణ్య, తహసీల్దార్ షేక్ అహ్మద్, బొంగు జంగయ్యగౌడ్, ముటుకుల్లోజు దయాకరాచారి, మహ్మద్ బాబాషరీఫ్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, చింతల దామోదర్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, తడక చంద్రకిరణ్, ఊడుగు మల్లేషంగౌడ్, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఎండి. ఖలీల్, వీరమల్ల సత్తయ్యగౌడ్, ఊడుగు రమేష్‌గౌడ్, దుబ్బాక శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి ఆడబిడ్డలకు వరం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు పెద్ద వరమని మును గోడు శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లో శనివారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు ఆయన తన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. మండలంలోని 18 మంది లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 14 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా వారందరి వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఆడబిడ్డ పేదింటి వాళ్లకు భారం కాకూడదనే సదుద్ధేశ్యంతోనే తమ ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేస్తోందని వివరిం చారు. మొదట రూ.51 వేలుగా ఉన్న కల్యాణలక్ష్మి పథకం విలువను ప్రస్తుతం రూ. 75 వేలకు పెంచామన్నారు. రానున్న రోజుల్లో రూ. లక్ష వరకు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు.

Comments

comments