Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

యాదాద్రి పనుల్లో అలసత్వం పనికిరాదు…

CM-KCR

యాదాద్రి భువనగిరి: సిఎం కెసిఆర్ శుక్రవారం యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… యాదాద్రి పనులు వేగవంతంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కెసిఆర్ సతీసమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ పనులను సిఎం పరిశీలించారు. ఆ తరువాత అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గుట్ట అభివృద్ధి పనుల్లో ఎక్కడా అలసత్వం ఉండరాదని, పనులు వేగవంతంగా జరగాలన్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి తీరాలని అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు.

CM KCR Visits Yadadri Temple Today.

Comments

comments