Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సిఎం హామీలన్నీ నీటిమూటలే

cong2

*రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుంది
*సిఎల్‌పి ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతున్నదని, దానిని అంత మొందించేందుకు ప్రజలు సిద్ధం కావాలని సిఎల్‌పి ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సెర్ప్ సిబ్బంది తమ సమ్మెలో మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసా గుతుందని దానిని అంతమొందించేందుకు ప్రజలు సిద్దం కావాలని సిఎల్‌పి ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సెర్ప్ సిబ్బంది తమ సమ్మెలో భాగంగా శనివారం మహిళలు నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సమ్మెకు సంపూర్ణ మధ్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉన్న న్యాయపరమైన చిక్కు లను తొలంగించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకుం టుం దని విమర్శించారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన మహిళలు పం డుగలను సమ్మెలలోనే నిర్వహించుకునే దుస్థితికి ప్రభుత్వం తీసుకువ చ్చిందన్నారు. ఆర్ధిక బారం కాని సమస్యలను కూడా పరిష్కరించలేని అసమర్ధపాలన తెలంగాణలో కొనసాగుతుందన్నారు. ఉద్యోగులు భయాన్ని వీడి సమస్యల సాధనకు ఉద్యమించాలని పిలుపుని చ్చారు. సెర్ప్ ఉద్యోగుల వేతనాలు స్థిరీకరించి, మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ, అభయ హస్తం కొనుసాగింపుపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చేలా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని అన్నారు. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబదిలీకరణ, నూతన ఉద్యోగుల కల్పన, మహిళా సంఘాల వడ్డీ, రాయితీ చెల్లింపు వంటి హామీలను అమలు చేయాలని కోరుతూ సెర్ప్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. జిల్లా కలెక్టర్ కార్యా ల యం వద్ద చేపట్టిన సమ్మె రోజురోజుగా ఉదృతంగా మారుతుందని సెర్ప్ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సెర్ప్ జెఎసి నాయకులు వి. కృష్ణయ్య, ఎ. నరసయ్య, ఇ. జోజప్ప, గట్టు శ్రీని వాస్, ఆర్. శ్రీదేవి, జానకీ, విజయలక్ష్మి, కవిత, పాల్గొన్నారు.

Comments

comments