Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి

light

*ముస్తాబైన నటరాజ్ 

థియేటర్
*నేటి నుంచి వారం
రోజులపాటు ప్రదర్శనలు
*స్ఫూర్తిదాయక చిత్రాలకే స్థానం

మనతెలంగాణ/నిజామాబాద్‌రూరల్: బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి స్ఫూర్తిదా యక చలన చిత్రాలు ఉపకరిస్తాయనే ఉద్దేశ్య ంతో ప్రభుత్వం అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించనుంది. ఇందులో భాగంగా నగరం లోని నటరాజ్ థియేటర్‌ను ఎంపిక చేసిన జిల్లా ఇన్‌ఛార్జీ కలెక్టర్  రవీందర్‌రెడ్డి అవసరమైన ఏర్పాట్లు చేయిం చారు. నేటి నుండి ఈ నెల 14వ తేది వరకు రోజుకు మూడు చిత్రాలను ప్రదర్శించను న్నారు. ప్రతిరోజు ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు, 20గంటలకు సినిమాలు ప్రదర్శింతమవనున్నాయి. బాలబా లికల్లో స్పూర్తిని నింపే పలు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తూ, విద్యార్థులు ఉచితంగా తిలకించే ఏర్పాట్లు చేశారు.
హింది, తెలుగు బాషా చిత్రాలను ప్రదర్శిస్తూ దైర్య సాహ సాలను పెంపొందించాలనే తపనను వెలిబు చ్చారు. సామాజిక స్పృహను పెంపొం దిచండానికి ఉద్దేశించిన ఈ చిత్రాలను విద్యార్థులు వీక్షించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బాధ్య తలు అప్పగిం చారు. ఈ ప్రత్యేక చిత్రాల ప్రదర్శన నేపథ్యంలో థియేటర్‌ను విద్యుత్‌దీ పాలతో అలంకరించారు. నేటి నుండి వారం రోజుల పాటు విద్యార్థులతో ఈ థియేటర్ కలకలలానుంది.

Comments

comments