Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

నేటి అర్ధరాత్రితో మరుగుదొడ్లు పూర్తి

amra

అధికారులను ఆదేశించిన కలెక్టర్ 

హసన్‌పర్తి: మండలంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాను ఈనెల 15లోపు బహిరం గ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించాలనే లక్షంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను నేటి రాత్రితో పూర్తిచేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాట అమ్రపాలి అన్నారు. సోమవా రం మండలంలోని జయగిరి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలను కలెక్టర్ అమ్రపాలి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయగిరి గ్రామంలో 113 మంది ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్లను మంజూరు చేశారు. గత నెలరోజులుగా నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నా యి. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ అమ్రపాలి తరుచుగా మండలంలోని పలు గ్రామాలను సందర్శించి నిర్మాణాలను పరిశీలించారు. అయినా కూడా నిర్మాణాలు కూడా మందకొడిగా సాగుతుండడంతో కలెక్టర్ అధికారులపై సీరియస్ అయ్యారు. జయగిరిలో వ్యక్తిగత మరుగుదొడ్లు 113కు 35 మాత్రమే పూర్తి అవడంతో కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చుంటే పనులు జరగవని, గ్రామాల్లో తిరగాలని హితవు పలికారు. విధుల పట్ల నిర్లక్షం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరుగుదొడ్లు పూర్తయ్యేంతవరకు గ్రామాన్ని వదిలిపెట్టి పోకూడదని హసన్‌పర్తి ఎంపిడిఒకు ఆదేశించారు. రాత్రింబవళ్లు కష్టపడి మరుగుదొడ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. లక్షాలను చేరుకోని అధికారులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. జయగిరిని సందర్శించిన వారిలో కలెక్టర్‌తో పాటు డిఆర్‌డిఎ పిడి రాము, జడ్పిటిసి కొత్తకొండ సుభాష్‌గౌడ్, గ్రామ సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఎపిఒ విజయలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ సుదర్శన్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీధర్, వార్డు మెంబర్లు కృష్ణంరాజు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments