Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

సిఎం కెసిఆర్‌కు రేవంత్ లేఖ

KCR-and-Revanth-Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలను ఆదుకోవాలని, నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయాగౌడ్ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నట్టు రికార్డులో ఉందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. సాయాగౌడ్ విషయమై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నివేదిక పంపించినా ఇప్పటి వరకు ఆయన కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదన్నారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు అమరులను ఆదుకునే విషయంపై చర్చ జరపాలని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

Comments

comments