Search
Monday 11 December 2017
  • :
  • :

ఎసిబి వలలో కానిస్టేబుల్

ph
తాండూరు : బాధితుని వద్ద రూ.5 వేల లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఎసిబికి పట్టుబడిన సంఘటన తాండూరు పట్టణంలో శుక్రవారం జరిగింది. గంగోత్రి పాఠశాల వద్ద ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన రాంచందర్ గత 15 రోజుల క్రితం ఆటోలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయంలో యాలాల మండల పోలీస్ స్ఠేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజేందర్‌గౌడ్ పట్టుకున్నాడు. దీం తో ఆటోను వదిలి పెట్టాలని వేడుకున్నారు. దీంతో రూ.10 వేలు ఇవ్వాలని లేని పక్షంలో కేసులు చేస్తామని బెదిరించాడు.దీంతో భయపడ్డ రాం చందర్ రూ.5 వేలు ఇచ్చి మిగిలిన రూ,5 వేలు తరువాత ఇస్తానని చెప్పారు. సంఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా రూ.5 వేలు ఇవ్వడం లేదని రోజు కానిస్టేబుల్ రాజేందర్ గౌడ్ వేధిస్తున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితిలో రాంచందర్ ఎసిబిను ఆశ్రయించాడు, దీంతో శుక్రవారం ఎసిబి అధికారుల ఆదేశాల మేరకు రాంచందర్ శుక్రవారం గంగోత్రి పాఠశాల వద్ద రాజేందర్‌గౌడ్‌కు ఇవ్వగా, ఎసిబి అధికారులు దాడి చేయడంతో కొన్ని నోట్లను నమిలివేశారు. వెంటనే అధికారులు నోట్లను స్వాధీనం చేసుకుని రాజేందర్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి తాండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడిలో ఎసిబి డిఎస్‌పి సూర్యనారయణ రాజు, సిఐ విజయ భాస్కర్‌రెడ్డి, లక్ష్మి దాడులు చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ రాజేందర్ గౌడ్‌ను అరెస్ట్ చేసినట్లు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Comments

comments