Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కమలాపూర్ సిగలో…కిలికితురాయి

project

ఏడాది తర్వాత కమలాపూర్ మండలంలో గ్యాస్ ప్లాంట్ వెలుగులు విరజిమ్ముతూ పలువురుకి ఉపాధి అవకాశాలు కల్పించనున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం కమలాపూర్ మండలంలో నిర్మాణం జరుగుతోంది. మండలానికి హెచ్‌పీసియల్ గ్యాస్ ప్లాంట్ కలికితురాయిగా నిలువనుండగా రాష్ట్రంలో కమలాపూర్‌కు ప్రాముఖ్యత దక్కనుంది. చెర్లపెల్లి తర్వాత రెండో ప్లాంట్ ఇక్కడ నిర్మాణం కావడం మండల ప్రజలు చేసుకున్న అదృష్టమే అయినప్పటికీ గ్యాస్ ప్లాంట్ నిర్మాణంతో వందిలాది మందికి ఉపాధి లభించనుంది. సరిగ్గా వచ్చే ఏడాది నవంబర్ కల్లా ప్లాంట్ నిర్మాణం పూర్తిచేయాలన్న లక్షంతో కంపెనీ చకచకా పనులు చేపడుతూ ముందుకు సాగుతోంది.
కమలాపూర్:మండల కేంద్రం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో 55ఎకరాల విస్తీర్ణంలో హిందూస్థాన్ పెట్రోలి యం అండ్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌పీసియల్) గ్యాస్ ప్లాం ట్ నిర్మాణం జరుగుతుంది. సుమారు రూ.95కోట్ల వ్యయం తో హెచ్‌పీసీయల్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతుంది. ప్లాంట్‌కు 2014లో బీజంపడగా 2016 రెవె న్యూ అధికారులు భూమి సర్వేచేసి కంపెనీకి భూమిని అప్పగించేందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. కంపెనీ నిర్మాణం కు 55ఎకరా ల భూమికి ప్రభుత్వం 24ఎకరాల భూమిని సమకూర్చగా మరో 10ఎకరాల పట్టాభూమిని రూ.3కోట్ల 94లక్షలకు కొనుగోలుచేసి కంపెనీకి అప్పగించింది. దీంతో కంపెనీ కమలాపూర్‌లో నిర్మాణంకు పచ్చజెండా పడ్డప్పటికీ భూమి కంపెనీ ఆధీనంలోకి వెళ్ళడంలో కొంత జాప్యం తలెత్తింది. దీంతో పనుల ప్రారంభంకు కొంత ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాదిలో కాలుష్యనియంత్రణ మండలి నుంచి అనుమతు లు రావడంతో పనులు ప్రారంభమవగా, చెర్లపెల్లి తరువాత మన రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న రెండో హెచ్‌పీసీయల్ గ్యాస్ ప్లాంట్ ఇదే.
యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్న పనులు …
గ్యాస్ ప్లాంట్‌కు భూమిని అప్పగించి కాలష్య నియంత్రణ మండలి అనుమతులు వచ్చినప్పటి నుంచి ప్లాంట్ పనులు యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్లాంట్ లో గ్యాస్ ఫిలింగ్ చేసే పెద్ద పెద్ద ట్యాంక్ నిర్మాణాలకు పెద్ద మొత్తంలో స్టీల్ ప్లాంట్ స్థలంకు చేరుకోగా ప్లాంట్‌కు సంబంధించిన పనులు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రహరీ నిర్మాణం జరుగగా 30శాతం పనులు ఇప్పటివరకు పూర్తయినట్లు కంపెనీ సిబ్బంది తెలుపుతున్నారు.
నిత్యం 14 వేల సిలెండర్లు తయారీ …
ప్రతి సంవత్సరానికి గ్యాస్ ప్లాంట్‌లో 60వేల టన్నుల గ్యాస్ ను ఉత్పత్తిచేసే లక్షంతో ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. అధునాతన టెక్నాలజీతో నిర్మాణం జరుగుతున్న ప్లాంట్‌లో ప్రతిరోజు 14వేల గ్యాస్ సిలెండర్లను కంపెనీ తయారు చేయనుంది.
15 జిల్లాలకు రవాణ…
కమలాపూర్ గ్యాస్ ప్లాంట్ నుండి నిత్యం వేలాది సిలెండర్లను వందలాది లారీల్లో 15జిల్లాలకు సరఫరా చేయనున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మానుకోట, జనగామ, జయశంకర్ భూపాల్‌పెల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపెల్లి, స్ధంభాద్రీ, భద్రాద్రీ, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సిలెండర్ల సప్లయి జరుగుతుంది.
వందలాది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు
కమలాపూర్‌లో నిర్మాణం అవుతున్న హెచ్‌పీసీయల్ గ్యాస్ ప్లాంట్‌తో సుమారు 200మంది వరకు ఉద్యోగ అవకాశాలు లభించనుండగా, వందలాది కుటుంబాలకు ప్లాంట్‌తో ఉపాధి వెలుగులు పొందనున్నారు.
వచ్చే నవంబర్‌కు కల్లా పనులు పూర్తి…
ఇప్పటికే ప్లాంట్ నిర్మాణం పనులు ఆలస్యమవుతున్నాయని 2018 నవంబర్ కల్లా పనులు పూర్తిచేయాలనే లక్షంతో పనుల్లో స్పీడ్ పెంచినట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. నవంబర్ చివరివరకు ప్లాంట్ పనులు పూర్తిచేసి ప్రారంభంకు సిద్ధం చేసే దిశగా పనులు సాగుతున్నాయి.
ప్రభుత్వ భూమితో ప్లాంట్ నిర్మాణంకు ఇబ్బందులు…
ప్లాంట్ నిర్మాణంకు కావాల్సిన 55ఎకరాల్లో ఇప్పటికే రెవె న్యూ అధికారులు 24ఎకరాలను కేటాయించగా మరో పది ఎకరాల పట్టా భూమిని కొనుగోలుచేసి కంపెనీకి అందజేయడం జరిగింది. దీంతో ఉన్న 34ఎకరాల్లో పనులు కం పెనీ వారు ప్రారంభించినప్పటికీ ఇంకా 21ఎకరాల భూమి వరకు కొరత ఏర్పడుతుంది. రెవెన్యూ అధికారులు మిగితా అప్పగించాల్సిన భూమిపై ఊసెత్తకపోవడంతో కంపెనీ నిర్మాణంలో కొంతమేరకు ఇబ్బందులు వస్తున్నాయి. రావాల్సిన భూమికోసం కంపెనీ ప్రతినిధులు అధికారులు చుట్టూ తిరుగుతుండగా ఇప్పటివరకు దానిపై క్లారటీ లేకపోవడం విశేషం.
కమలాపూర్‌కు దక్కిన గ్యాస్ ప్లాంట్ ఛాన్స్ …
కమలాపూర్ మండల కేంద్రంలో వందలాది ఎకరాల్లో ప్రభు త్వ భూమే గ్యాస్ ప్లాంట్ నిర్మాణంకు దొరికిన అపూర్వమైన ఛాన్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నుండే గ్యాస్ ప్లాంట్ నిర్మాణంకు కంపెనీ ప్రతినిధులు జిల్లాలు తిరుగుతు న్న తరుణంలో అప్పటి కరీనంగర్ జిల్లాలోని కమలాపూర్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రభుత్వ భూమి ఉండటంతో కంపెనీ ఇక్కడ తిష్టవేసి నిర్మాణంకు పచ్చ జెండా ఊపింది.
కమలాపూర్ మార్కేట్‌కు కళ…
గ్యాస్ ప్లాంట్ నిర్మాణమైన తరువాత స్థానికంగా భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు చిన్నా చితక వ్యాపారాలకే పరిమితమైన కమలాపూర్‌కు కొంత మార్కెట్ కళ వచ్చే అవకాశాలున్నాయి. నిత్యం వందలాది లారీలు రవాణాతో వ్యాపారం పెరుగనుండగా, ఉద్యోగులతో అద్దె ఇళ్ళకు కిరాయితాకిడి తగలడంతో అమాతం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పలు రకాల వ్యాపారులకు గ్యాస్ ప్లాంట్ దీపం పెట్టనుండటంతో

సమస్యగా మారిని భూ నిర్వాసితుల భూములు..
గ్యాస్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన నిరుపేదలు తమ కు నష్టపరిహారం చెల్లించాలంటూ ధర్నాకు దిగిన సంఘట న నేపథ్యంలో ప్లాంట్ నిర్మాణంకు కొంత సమస్యగానే తయారవనుంది. భూములు కోల్పోయిన వారిని గుర్తించి రెవెన్యూ అధికారులు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Comments

comments