Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

అభివృద్ధి ముసుగులో అవినీతి!

corporation

పనుల్లో నాణ్యతకు తిలోదకాలు కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం

మన తెలంగాణ / ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయితే..బతుకులు మారుతాయనే ఆశ ఉండేది. కోట్లాదిరూపాయల నిధులు వస్తాయని, ఆ నిధులతో అభివృద్ధి పరుగులు పెడుతుందనే భావన ఉండేది. నగరంమరింత సుందరంగాతయారవుతుందనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు అదంతా అడియాసేనని తేలిపోయింది. ప్రస్తుతం అడుగడుగునా అవినీతే తాండవి
స్తోంది. 2013లో ఖమ్మం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందగా, 2016 మార్చి 15న కొత్త పాలకవర్గంఏర్పడింది. అధికార పార్టీ కార్పొరేషన్ కైవసం చేసుకోవడంతో అధిక నిధులతో నగరాన్ని సుందరంగాతీర్చిదిద్దుతారని ఆశించిన నగర ప్రజలకు నిరాశమిగులుతోంది. నిధులు వస్తున్నా వాటిలో నాణ్యమైనపనులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసనవ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంలో ఖమ్మం కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి సుమారు రూ.25కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. అయితేపర్సంటేజీల భాగోతం భారీగా ఉండటంతో పనుల్లోనాణ్యతకు తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. అధికారుల, ప్రజాప్రతినిధుల పర్సంటేజీలు,కాంట్రాక్టర్ల లాభం పోగా చివరకు ఆ పనుల్లో 50శాతం కూడా పనులు జరగడంలేదని తెలుస్తోంది.

కార్పొరేటర్లే కాంట్రాక్టర్లు…కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు గానూ ఒక్కొక్క డివిజనుకు 30లక్షల వంతున రూ.15 కోట్లతో డ్రైనేజీ, సిసి రోడ్లుతాత్కాలిక మరమ్మతులకు కేటాయించారు. ఈ పనులను బినామీలరూపంలో గుత్తేదార్లుగా అవతా రమెత్తిన కొందరు కార్పోరేటర్లు బినామీలతో పనులు చేపట్టారు. రూ.15 కోట్ల పనుల్లో ఏడాదిలోదాదాపు 60 శాతం నిధులతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టగామిగతాపనులు పూర్తికాలేదు. ఈపనులలోను నాణ్యత లోపించిందనిఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులలో నాణ్యత లేకపోయిన బిల్లులుచెల్లించాలని కొందరు కార్పోరేటర్లు అధికారులపై ఒత్తిడిపెంచుతున్నారు. ఇటీవల జిహెచ్‌ఎంసి నుంచి బదిలీపై వచ్చిన ఎస్‌ఈకిక్వాలిటీ కంట్రోల్ విభాగంలోన ఓ అధికారి ఖమ్మం నగరంలోజరుగుతున్న అవినీతిపై అధికారికి వివరించారు.

కనీస ప్రమాణాలుపాటించకుండా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యతకుతిలోదకాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఖమ్మంకార్పొరేషన్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారినికోరినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు పనుల్లో నాణ్యతపాటించకుండా బిల్లులు చెల్లించాలని ఎంఈ పై ఒత్తిడి తీసుకురావడంతో ఆ అధికారి దీర్ఘకాలీక సెలవులపై వెళ్ళగా ఆయన స్థానంలోవచ్చిన పబ్లిక్ హెల్త్ అధికారి పర్సంటేజీలే లక్షంగా ముందకుసాగుతున్నట్లు వినికిడి. ఇటీవల ఓ మార్కెట్ శ్లాబ్ వేస్తున్న సమయంలోపబ్లిక్ హెల్త్ అధికారులను సైతం పురమాయించినట్లు తెలుస్తుంది.ఖమ్మం పాత మున్సిపాల్టీతో పాటు కార్పొరేషన్‌లో విలీనమైన తొమ్మిదిపంచాయతీలకు తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథఅనుసంధానంతో రూ.230 కోట్లతో చేపడుతున్న అమృతపథకం కుఅధికారిగా ఉన్న వ్యక్తినే ఖమ్మం కార్పొరేషన్ ఎంఈగా ఇంచార్జిబాధ్యతలు ఇవ్వడంతో అటు అమృత పథకం పనులు, మరో పక్క కార్పొరేషన్‌లో జరుగుతున్న పనుల పర్యవేక్షణ సరిగా జరగడం లేదనేఆరోపణలు విన్పిస్తున్నాయి. రూ.10 కోట్లతో రోడ్లు, పైపులైన్ల పనులు, డ్రైనేజి పనులు చేపట్టారు.

ఇందులో రోడ్లు, డ్రైనేజీ పనులనుకార్పోరేటర్లు బినామీ అవతారం ఎత్తడంతో ఈ పనుల్లో నాణ్యతలోపించిందని, త్రాగునీటి పైపు లైను నిర్మాణం కోసం అగ్రీమెంటులోచేసిన ప్రకారం గేట్‌వాల్స్‌ను ఏర్పాటు చేయకుండానే నాసిరకమైనమెటిరీయల్ వాడి బిల్లులు వసూళ్ళు చేసుకొన్నట్టు ఆరోపణలువినిపిస్తున్నాయి. కమీషన్‌లతో కరిగిపోతున్నా నిధులు…కార్పోరేటర్లు కాంట్రాక్టర్ల అధికారుల నుంచి భారీగా కమీషన్లు వసూళ్లుచేస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కార్పోరేటర్లు బినామీఅవతారంలో పనులు చేస్తుంటే, మరి కొందరు కార్పోరేటర్లు తమడివిజన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి 8 నుంచి 10 శాతం వరకుకమీషన్ వసూళ్లు చేస్తునట్లు తెలుస్తుంది.

కార్పోరేషన్‌లో ముఖ్యాధికారికి 2 శాతం, ఇంజనీరింగ్ విభాగంలోని ఓ అధికారికి 2 శాతం, మరోఅధికారికి 2 శాతం, క్రింది స్థాయి అధికారులు ఏఈలకు 1 శాతంచొప్పున కమీషన్ వసూళ్లు చేస్తునట్లు సమాచారం. ఇలా కమీషన్‌లరూపంలో 30 శాతం పైగా ఉండటం, పనులు దక్కించుకొన్నగుత్తేదారులు మరో 20 శాతం మిగుల్చుకోవడంతో 50 శాతంకమీషన్‌లకే పోగా మిగిలిన 50 శాతం నిధులతో పనులు సరిగ్గా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

comments