Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

సిపిఐ పోరుబాట

cpiసామాజిక తెలంగాణ కోసమే

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

పాలకుర్తి: ప్రజల బతుకులు మా ర్చే సామాజిక తెలంగాణకోసమే సిపిఐ పోరుబాట చేపట్టిందని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నా రు. సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి పోరుబాట మంగళవారం పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఉన్న భూ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి చాడ వెంకట్‌రెడ్డి, పూలమాలలువేసి, ఘనంగా నివాళ్ళులర్పించారు. అనంతరం పోరుబాట నుద్దేశించి ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్‌ముక్‌ను ఎదిరించి పోరాడిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్‌బందగిలు జన్మించిన ఈ ప్రాంతం విప్లవాల గడ్డ చైతన్యవంతమైన ప్రాంతం అని అన్నా రు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆ ర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలు చెబుతూ రాష్ట్రంలో నిజాం ని రంకుశ పాలన సాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత శా తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమాన్ని టి ఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేజి టు పిజి ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూం, దళితులకు 3 ఎకరాల వ్యవసాయం, ఇంటికో ఉద్యోగంలాంటి హామీలు ఏవి అమలుకు నోచుకోలేదన్నా రు. మా నిధులు మాకు, మా నీరు మాకు, మా కొలువులు మాకు అన్న కేసీఆర్ మాయమాటలతో రాష్ట్రం ఏర్పాటై అధికారం చేపట్టిన నాటికి అప్పు రూ.60900 కోట్లు కాగ కేసీఆర్ అధికా రం చేపట్టిన 3సంవత్సరాల పాలనలో ఒక లక్ష యాబై నాలుగువేల కోట్ల అప్పులోకి కేసీఆర్ రాష్ట్రాన్ని నెట్టారని విమర్శించారు. మా నీరు మా కు అన్న మాటలు అమలు కాక పోగ గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని నింపకుండా తప్పుడు ప్రకటనలతో నిరుద్యోగుల వెంట కన్నీరు పెట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా బిల్లులు మంజూ రు చేయలేదన్నారు. ఇప్పటివరకు నిరుపేద ప్రజలకు ఎక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన దఖలాలు లేవని సిఎం కేసీఆర్ ఫాం హౌజ్ ప్రాం తంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చారని, రాష్ట్రంలోని బడుగు బలహీనులు ఎదురుకుంటున్న సమస్యల గురించి మాట్లాడు దాం అంటే ఆల్‌పార్టీ మీటీంగ్ ఏర్పాటు చేయ రు, ఇటు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని మండిపడ్డారు. సిపిఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందన్నారు. సాయుధ పోరాట చరిత్ర కలిగి సుమారు నాలుగువేల అయిదు వందల మంది ప్రాణాలు తృణపాయంగా వదిలివేసిన చరిత్ర సిపిఐదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ పాత్ర చరిత్రలో నిలిచిందన్నారు. బేషరతుగా రాష్ట్రం ఇవ్వవల్సిందేనని నీరు, నిధులు, విద్య, వైద్యంలో అసమానతలు ఉన్నాయని, ఆంధ్రపాలకులు మోసం చేస్తున్నాయని, ఆనాడు నిర్భయంగా చెప్పింది సిపిఐ అన్నారు. దళితుడిని సిఎం చేయకుంటే తల నరుక్కుంటానని సత్య హరిశ్చంద్రుడిలా చెప్పిన సిఎం కేసీఆర్ మాటలు ఇప్పుడు గుర్తు లేవా అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహంభావం తో మాట్లాడుతున్నారని కమ్యూనిస్టులకు ఏమి మిగిలింది స్థూపాలే తప్ప అని అహంభావంగా అన్నదానిపై చాడ తీవ్రంగా స్పందించి, అమర స్థూపాల విలువ చరిత్ర తెలియని కేసీఆర్‌కు ఏమి తెలుసునని హేలన చేశారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కమ్యూనిష్టులకు ఉందని తెలిపారు. తెలంగాణకోసం శ్రీకాంత్ చారితో పాటు ఎందరో యువ కిషోరాలు ప్రాణాలు అర్పిస్తే ఆ బలిదానాలు కేసీఆర్ తన స్వార్ధానికి ఉపయోగించుకున్న చరిత్ర అని అన్నారు. నిస్వార్ధ ప్రజా నాయకుడు కోదండ రాం లాంటి నాయకులను బూతులు తిడుతు అక్రమ అరెస్టులు చేసి నిర్భందిస్తున్నారని అహంబావులకు చరిత్రలో ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో కేసీఆర్‌కు కూడా ఆదే గతి పడుతుందని అన్నారు. ఈ పోరు యాత్రకు సిపిఐ, సిపి ఎం నాయకులు సంఘీబావం తెలిపారు. సిపిఐ రాష్ట్ర నాయకులు బాల మల్లెష్, బర్షెపద్మ, ఎండి యూసఫ్, సృజన, పాండురంగా చారి, రాము లు యాదవ్, అంజయ్య నాయక్, లక్ష్మినారాయణ, నర్సింహ్మ, నల్ల శ్రావణి, తక్కెలపల్లి శ్రీనివాస రావు, అజయ్ సారధి, జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజా రెడ్డి, రాములు, ఆకుల శ్రీనివాస్, పాలకుర్తి, స్టేషన్‌ఘనపుర్ మండలాల కార్యదర్శులు, నాయకులు గుమ్మడి రాజుల సాంబయ్య, చెల్ల శశికళ, వెంకట్ రెడ్డి ఉన్నారు.

Comments

comments