Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

తీరు మారుకుంటే ప్రజాగ్రహం తప్పదు

Cpi-leaders

మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : సామాజిక తెలంగాణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంకోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి చేపట్టిన పోరుబాట గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి చేరుకుంది. పాల్వంచ మీదుగా ఇల్లందు క్రాస్‌రోడ్డుకు చేరుకున్న పోరుబాట బృందానికి  ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి రైల్వేస్టేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు జరిగిన బైక్ ర్యాలీ, కళాకారుల డప్పులు, కోలాటాల నడుమ వినుత్న నృత్యాల ఆకట్టుకున్నాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రాష్ట కార్యదర్శి చాడ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి కెసి ఆర్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి భాష, బాట మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజ లు ఆగ్రహానికి గురైతే అడ్రస్ లేకుండా పోతారని ధ్వజమెత్తారు.అంతా తానే అంటున్న ముఖ్యమంత్రి  రాష్ట్రంలో జరిగే పరిణామాలకు  ఉలుకెందుకని జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రశ్నించారు.  ప్రతిపక్షాలు, ఉద్యమకారుల గొంతునొక్కినంత మాత్రాన ప్రజా తిరుగుబాటును అడ్డుకోలేరని హెచ్చరించారు. కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలును విస్మరించి రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తున్నారని రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. కృష్ణ, గోదావరి నదీ జలాలను సద్వినియోగపరచకుండా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియో గం చేస్తున్నారని మండ్డిపడ్డారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అన్నవరపు సత్యనారాయణ, భూక్య రమేష్ సంఘీభావం ప్రకటించారు. పోరుబాట బృదం సభ్యులు బాల మల్లేష్, పశ్యపద్మ, ఎండి.యూసుఫ్, బరిగెల తదితరులు పాల్గొన్నారు.

Comments

comments