Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం

CPI-Narayana-imageమోడీకి అమ్ముడుపోయే సరుకు కెసిఆర్ వరంగల్‌లో సిపిఐ బహిరంగ సభ

మన తెలంగాణ/వరంగల్: హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమ ర్శించారు. వరంగల్‌లోని రంగశాయిపేటలో బుధ వారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిఎం కెసిఆర్ ప్రధానిక మో డీకి అమ్ముడుపోయే సరుకుగా తయారయ్యారని విమర్శించారు. ప్రధాని మోడీ, ఆర్‌బిఐ గవర్నర్ లు కలిసే ఈ నాటకమాడారని ఆరోపించారు. బీ డీ, చేనేత కార్మికులపై జిఎస్‌టి వేసి వారిని ఇ బ్బందులు పెడుతున్నారన్నారు.

మరోవై పు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కొడుకు అనాతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడన్నారు. తెలంగాణ ఉద్యమం లో వరంగల్ పాత్ర చాలా కీలకమైందని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. అక్రమ సంపాదన కోసమే స చివాలయ డ్రామ ఆడుతున్నారని, వాస్తు పేరుతో ఆఫీసులను, కలెక్టరేట్లను కూల్చివే యడం సరికా దన్నారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లా డుతూ అధికారంలోకి రాగానే కెసిఆర్ కళ్లు నెత్తికె క్కాయని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిని విమర్శిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చి న హామీలను ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. సర్వేల పాలనపై కెసిఆర్‌కు నమ్మక ముంటే పార్టీ ఫిరా యించిన 30మంది ఎంఎల్ ఎల రాజీనామాలు ఆమోదించి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ వి సిరారు. కెసిఆర్‌ను ఇంటిబాట పట్టించడమే సిపిఐ పోరుబాట లక్షమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, గుడిసెవాసులు, పెద్దమొత్తంలో సభకు హాజరయ్యారు.

Comments

comments