Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

పోలీసుల అక్రమాలపై కొరడా

police2

మంచిర్యాల ఏసిపి చెన్నయ్య బదిలీ
ల్యాండ్ సెటిల్‌మెంట్లతో అభాసుపాలు
శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నా మారని తీరు
ఎస్‌ఐల నుంచి మొదలుకొని ఏసిపి వరకు సాగుతున్న దందా

భూముల సెటిల్‌మెంట్ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఇరువర్గాల నుంచి లక్షలాది రూపాయ లు వసూలు చేశారనే ఆరోపణలు చోటు చేసుకు న్న నేపథ్యంలో మంచిర్యాల ఏసిపి చెన్నయ్యను పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేశారు.  ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేస్తూ డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఏసిపి చెన్నయ్యపై  ఏసిబి అధికారులు కే సు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.  ఎసిబి అధికారులు కేసు నమోదు చేసిన అనంతరం విచారణ జరుపగా అక్రమాలు బహిర్గతం కావడంతో శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక పంపించా రు.  ఈమేరకు మంచిర్యాల ఏసిపి చెన్నయ్యను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశా రు. కాగా గత కొంత కాలంగా మంచిర్యాల జి ల్లాలో పోలీసు అధికారులు శాంతిభద్రతల సమస్యలను పక్కనబెట్టి ఎక్కువగా ల్యాండ్ సెటిల్‌మెంట్లపైనే   దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.  జిల్లా కేంద్రం లో భూముల ధరలు ఒక్కసారిగా పెరగడంతో  ఎ స్‌ఐ స్థాయి నుంచి మొదలు కొని ఏసిపి స్థాయి వరకు  భూముల దందాల్లో  జోక్యం చేసుకుంటూ లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే  జిల్లాలో నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సిఐలు, మరో ఇద్దరు ఏసిపిలు బదిలీపై వెళ్లడం చర్చనీయాంశంగా మా రింది. బదిలీపై వెళ్లిన అధికారులందరు ప్రధానంగా అవినీతి అక్రమాలతో పాటు ల్యాండ్ సెటిల్‌మెంట్లలో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  మంచిర్యాల ఏసిపి  చెన్నయ్య బది లీ వ్యవహారం వెనుక భూముల దందాలో లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆ రోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని న్యూడెమోక్రసీ  కార్యాలయం వెనుక ఉన్న ఓ భూ వివాదంలో పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య జరుగుతున్న ఈ గొడవలో తలదూర్చిన ఏసిపి చెన్నయ్య ముందుగా ఒక వ్యక్తితో ఒప్పందం కుదర్చుకొని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవ్యవహారంలో నేరుగా డబ్బులు తీసుకోకుండా అతని మిత్రులు బంధువుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయించి, తరువాత విత్‌డ్రా చేసుకున్నట్లుగా ఏసిబి అధికారుల విచారణలో తేలింది. ఒప్పందం చేసుకున్న ప్రకారం సదరు వ్యక్తి పూర్తిగా డబ్బులు అందించకపోవడంతో మరో వర్గం వ్యక్తితో ఒప్పందం చేసుకునే ప్రయత్నాల్లో ఇరుకుపోయారు రెండు వర్గాల నుంచి డబ్బులు వసూలు చేసి, ఎవరికి న్యాయం చేయకపోవడంతో సదరు వ్యక్తులు ఐజికి ఫిర్యాదు చేశారు. దీంతో రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గల్ శాఖ పరంగా విచారణ జరిపి మొదట ఏసిపికి సహకరించిన పట్టణ సిఐ సుధాకర్‌ను రామగుండం కమీషనరేట్‌కు బదిలీ చేశారు. కమీషనర్ నివేదిక ఆధారంగా ఉన్నతాదికారులు కేసును ఏసిబికి అప్పగించగా ఏసిబి అధికారులు ఏసిపితో పాటు సిఐ సుధాకర్‌ను హైదరాబాద్‌కు పిలిపించి, విచారించారు. భూ వివాదంలో భాగంగా ఏసిపి డబ్బుల కోసం ఆయా వ్యక్తులతో మాట్లాడిన సంభాషణల రికార్డులు ఏసిబి అధికారులకు కీలకంగా మారాయి. పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీస్ అధికారుల వైఖరిలో మార్పులు కనిపించగాపోగా సె టిల్‌మెంట్ల దందా జోరుగా సాగుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పని చేసే పోలీసు అధికారులతో పాటు మండల స్థాయిల్లో కూడా ఎస్‌ఐ, కింది స్థాయి సిబ్బంది కూడా భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల డిసిపిగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్‌రావు పోలీసు అధికారుల దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments