Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

క్రెడాయ్ రియల్టీ అవార్డులు

credai

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ డిజైన్, ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టులకు “తెలంగాణ రియల్టీ క్రియేట్2017” పేరుతో అవార్డులను అందజేయనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షులు జి.రామిరెడ్డి ప్రకటించారు. ఈ అవార్డులను ఇక నుంచి ప్రతిఏటా అందజేస్తామన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై జిఎస్‌టి ప్రభావం ఉందని, రాబోయే రోజుల్లో జిఎస్‌టి భారం తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం తెలంగాణ “క్రియేట్ -2017” అవార్డు లోగోను రామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.రాంచంద్రారెడ్డి, హైదరాబాద్ అధ్యక్షులు ఎస్.రామిరెడ్డి, వరంగల్ అధ్యక్షులు పి.వెంకటేశ్వర్ రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామిరెడ్డి మాట్లాడుతూ నిర్మాణరంగంలో పోటీతత్వం ఏర్పడి, నాణ్యత ప్రమాణాలు, నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇలాంటి అవార్డులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. అవార్డులను తొమ్మిది విభాగాలుగా (20 యూనిట్లకులోబడిన, పైబడిన అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు, రూ.40లక్షల వరకు, ఆపైన రూ.70లక్షల వరకు, విల్లాస్, ఆఫీస్ కమర్షియ్, ప్లాటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు) విభజించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు చాప్టర్లలో (క్రెడాయ్ ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలు) ప్రతి చాప్టర్ పరిధిలో “ఉత్తమ ప్రాజెక్ట్‌” అవార్డును అందజేస్తామని వెల్లడించారు. అవార్డుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తామని, సుప్రసిద్ద రీసెర్చ్ ఏజెన్సీ ద్వారా ప్రాజెక్టులను ఎంపిక చేస్తామన్నారు. డిసెంబర్ 15న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్థిరాస్తి నియంత్రణ చట్టం (రేరా)తో కొత్త ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో రావడం లేదని, దీనిపై కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్యులపై భారమే: జిఎస్‌టితో సామన్యులపై పెద్ద మొత్తంలోనే భారం పడుతుందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్.రామిరెడ్డి అన్నారు. బెంగళూరు నగరంలో  అమలులో ఉన్న రేరా కారణంగా అక్కడ 16వందల నుంచి 17వందల ప్రాజెక్టులకు గాను కేవలం 225 ప్రాజెక్టులను మాత్రమే అనుమతించారని, మిగిలిన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రియల్ రంగంపై జిఎస్‌టి తగ్గాల్సిన అవసరం ఉందని, వచ్చే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో దీనిపైనిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

comments