Search
Wednesday 21 March 2018
  • :
  • :
Latest News

బాట పక్కనే బావి

Bhavi-image

కమలాపూర్ గ్రామ శివారులో పొంచివున్న ప్రమాదం అదుపు తప్పితే అంతే సంగతులు ? ప్రమాదకరంగా మూలమలుపు,చెట్ల పొదలు
మంచి నీటి బావి ఎత్తు పెంచాలంటూ స్థానికుల వేడుకోలు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

మన తెలంగాణ/కమలాపూర్ : ఈ ఫొటోలో కనిపిస్తు న్న వెల్ అనునిత్యం వాహనదారుల గుండెల్లో డేంజర్ బెల్స్ ను మోగిస్తూనే ఉంది. బాట పక్కనే ప్రమాదకరంగా మారిన బావిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల పట్టింపు కరువై వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దానికితోడు మూలమలుపు ప్రమాదాలకు నెలవవుతూ వాహనదారులను ప్రమాదాలకు దారితీస్తోంది. కమలాపూర్ మండల కేంద్రంలోని గ్రామ శివారులో నెలకొన్న ఈ పరిస్థితి ఏళ్ళుగడుస్తున్నా పరిష్కారానికి నోచుకోని దుస్థితి.

కమలాపూర్ గ్రామ శివారులోని దేశరాజ్‌పల్లెకు వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే ఉన్న మంచినీటి బావిని కొద్ది సం వత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామ ప్రజలకు పెద్ద దిక్కు అయిన ఈ మంచినీటి బావి రోడ్డు నిర్మాణం జరుగనప్పుడు ప్రమాదకరంగా లేకపోయిన రోడ్డు నిర్మాణంతో రోడ్డుఎత్తు పెరుగడం మూలంగా బావి ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాదిమంది రైతులు, కూలీలు, వాహనదారులు, ప్రయాణికులు ఈ దారి వెంట వెళ్ళడం జరుగుతుంది. ఇక కమలాపూర్ గ్రామ శివారులోని పంటపొలాలకు వెళ్ళే రైతులతోపాటు దేశరాజ్‌పల్లె గ్రామ ప్రజలకు ఈ దారి ఎంతో అనువైనది కావడంతో రద్దీగానే ఉంటుంది. అవసరాలకోసం ఈ దారివెంట వెళ్ళే వా రు అధికంగానే ఉండగా దారినపోయే వాహనదారులు, ప్రయాణికులు మాత్రం వామ్మో మంచి నీళ్ళ బావి అనే పరిస్థితి నెలకొంది. రోడ్డు ఎత్తు ఎక్కువగా ఉండి రోడ్డపక్కనే ఉన్న బావి ఎత్తుతగ్గడంతో వాహనదారులు జంకుతున్నారు.

ఆ దారిన వెళ్లాలంటే భయపడుతుండగా అదుపుతప్పితే మా త్రం ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా మంచినీటి బావి ప్రమాదకరంగా మారడంతో దారినపోయే వారు భయాందోళనకు గురువుతున్నారు. ఇక రోడ్డు పక్కనే మంచినీటి బావికి తోడు మూలమలుపు ప్రమాదకరంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపించక ప్రమాదాలు జరుగుతుండగా పలువురు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఉన్నాయి. మూలమలుపు ప్రమాదకరంగా ఉందంటే అక్కడే నోరు తెరుచుకున్న మంచినీటి బావి మరింత ప్రమాదకరంగా మారగా తుమ్మ చెట్లు సైతం వాహనదారులకు ఇబ్బందులుపెడుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా తుమ్మ చెట్లు ఏపుగా పెరగడంతో వాహనాలు వచ్చేవి కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. విషయాన్నీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందన్న వాదనలు లేకపోలేదు. ఇక రాత్రిపూట అక్కడ వీధిలైట్లు వెలుతురు కూడా లేకపోవడంతో దేశరాజ్‌పల్లె వెళ్ళే బాటసారులు, వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. కనీసం వీధి లైట్లు ఏర్పాటుచేస్తే రోడ్డుపక్కనే ఉన్న బావి వాహనదారులకు కనిపించే అవకాశం ఉందని లేదం టే చిమ్మ చీకట్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వాహనదారులు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చర్యలు చేపడుతాం

                                                                                                                                                                                  లక్ష్మన్ రావు, ఎంపిపి

ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు, మంచినీటి బావి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బావి వద్ద నెలకొన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయి శాశ్వత పరిష్కారంకు చొరవ చూపడంతో పాటు బావికి అడ్డుగా గోడలాంటి నిర్మాణం చేపడుతామని తెలిపారు. బావి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి
జాఫర్ దేశరాజ్‌పల్లె, గ్రామస్థుడు

రోడ్డు ప్రక్కనే ప్రమాదకరంగా ఉన్న మంచినీటి బావి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వాహనదారులకు, ప్రయాణికులకు బావి, మూలమలుపు ప్రమాదకరంగా ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెట్ల పొదలను తొలగించాలి :

                                                                                                                                                                                           చంద్రారెడ్డి, రైతు
అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టి వెంటనే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల పొదలను తొలగించడంతో పాటు రోడ్డు ప్రక్కనే ప్రమాదకరంగా మారిన బావికి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

comments