Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

ఆ తర్వాతే రాజకీయ సన్యాసం : కడియం

KADIYAM

హైదరాబాద్ : ఎమ్మెల్సీగా తాను 2021 వరకు ఉంటానని, ఆ తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తాను ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని ఆయన చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యా వ్యవస్థ మరో ఐదేళ్లలో గాడిలో పడుతుందని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో దుష్ఫలితాలు కనిపించాయని ఆయన వెల్లడించారు. కాలేజీల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేశామేని, సరిపడా హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

DCM Kadiyam Srihari Comments on his Political Life

Comments

comments