Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పత్తి రైతుల మరణ మృదంగం

COTTON

* అప్పులు తీర్చే దారిలేక మరో రైతు ఆత్మహత్య 8 పంటలకు లభించని గిట్టుబాటు ధరలు
* పెట్టుబడులు వస్తాయో లేదోనని రైతుల ఆందోళన 8 పత్తి రైతులకు కలసి రాని కాలం

జిల్లాలో అత్యధిక శాతం సాగులో ఉన్న పత్తి పంటలకు కాలం కలసి రావడం లేదు. పంటలకు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టిన రైతులు గిట్టుబాటు ధరలు లభించగా దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రు. లక్షలాది రూపాయలు అప్పులుగా తీసుకవచ్చి పత్తి పంటలను సాగు చేస్తుండగా కాలం కలసి రాకపోవడం, మరోవైపు తెగుళ్లతో పురుగుల మందులు చల్లడం రైతులకు మరింత పెట్టుబడులను పెంచుతున్నాయి. దీంతో రైతులు చేసిన అప్పులను తీర్చలేక గ్రామంలో తలెత్తుకొని తిరుగలేక ఆత్మహత్యలనే శరణ్యంగా ఎంచుకుంటున్నారు. దీంతో రైతుల కు టుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ సీజన్‌లో మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో ఇప్పటికే ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా తాజా గా శుక్రవారం మరోరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. దహెగాం మండలం మండలంలోని పెసరకుంట గ్రామానికి చెందిన కామెర పెంటయ్య(45) గురువారం రాత్రి  వేరొక గదిలోకి ఒంటిరిగా వెళ్లి తలపులు వేసుకొని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని కనుగొని కన్నీరుమున్నీరుగా విలపించారు. పెంటయ్య తనకు ఉన్న 5 ఎ కరాల భూమితో పా టు కుమార్తె అత్తగారికి సంబంధించిన మరో 5 ఎకరాల భూముల్లో పత్తి పం టలను వేశారు. దీని కోసం రూ. 3 లక్షలు  అప్పులు చేశారు. పత్తి పంట కు పూత సరిగా రాకపోవడంతో  దీనికి తోడు తెగుళ్ల భారీ నుంచి పంటలను కాపాడుకోలేక పోవడం, గత మూడు రో జులుగా దిగులుగా ఉంటూ పెట్టుబడులు వస్తాయో రావోనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాలజిల్లాలో ఈ ఏడాది 53,928 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంటలను సాగు చేశారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్, సిసిఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి  చేశారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 4320 కనీస మద్దతు ధరగా ప్రకటించారు. అయితే కేంద్రాల వద్ద తేమ పేరుతో అధికారులు రైతులను వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు కూడా లేకపోలేదు. పత్తి రైతులు విత్తనం నాటినప్పటి నుంచే వర్షాలు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నడు లేని విధంగా ఈసారి పత్తికి తెగుళ్లు రావడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసిన తెగుళ్ల భారీ నుండి పంటలను కాపాడులేకపోతున్నారు. ఈయితే సారి తీరా పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతన్నలను మరింత నష్టాలకు గురిచేసింది. దీంతో కాయ నల్లబారి పిందెలు రాలిపోయి పత్తి దూదిరంగు మారిపోయింది. దీంతో ఈ ఏడాది దిగుబడి రావడం కష్టతరంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి బాగ పండినట్లయితే ఎకరాలనికి 6 నుండి 8 క్వింటాళ్ల వరకు చేతికి వచ్చే అవకాశాలు ఉండగా అకాల వర్షాలతో ఎకరానికి మూడుక్వింటాళ్లు కూడా వచ్చే అవకాశాలు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధరపైనే రైతులు ఆశలు పెట్టుకోగా ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాళ్‌కు రూ.4320 ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాది క్వింటాలుకు రూ. 6 వేలు ధర పలుకడంతో రైతులు సంతోషపడి ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పత్తి పంటలు వేసుకున్నారు. ఏదిఏమైనా గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు మరింత దిగులు చెంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Comments

comments