Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ధర్మక్షేత్రం…కురుక్షేత్రం

Harivillu-image

కురుక్షేత్రంతో సందర్శించదగ్గ తీర్దాల సంఖ్య 350 పైనే ఉన్నాయని చరిత్రకారులు చెపుతారు. కురుక్షేత్రం ధార్శిక క్షేత్రాల నగరంగా పేర్కోనబడినది.కురుక్షేత్రానికి నాలుగు వైపులా గుళ్ళు, గోపురాలతో విరజిల్లుతుందనడంలో ఏ మాత్రం
ఆతియోక్తిలేదు. కురుక్షేత్రంలో ఉన్న కొన్ని ముఖ్య మందిరాలు స్థలాల గురించి తెలుసుకుందాం.

శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పుట్టువెంట్రుకలు కురుక్షేత్రంలోనే తీయించినట్టు జనవాక్యం. యశోదా, నందులు బాలకృష్ణుడి పుట్టు వెంట్రుకలుకురుక్షత్రంలోని ప్రసిద్ద శక్తి పీఠమయిన భద్రకాళి మందిరంలో తీయించారు.కనుక స్నానం చేసేందుకు సరస్వతి నదీ జలం సన్నిహిత సరస్సుకు మళ్ళించారని ప్రతీది. ఆప్పుడు భద్రకాళి మందిరం సన్నిహిత సరోవర తీరంళక్ష ఉండేది.

సన్నిహిత తీర్ధం:సూర్యగ్రహణ సమయంలో సన్నిహిత తీర్ధంలో స్నానంచేస్తే అశ్వమేథ యాగం చేసిన ఫలితం దక్కుతుందని పెద్దల మాట, ఇష్ట కామ్యలు కూడా సిద్దిస్తాయని చెపుతారు. ప్రతీ ఆమావాస్య నాడు దివిలోను, భువిలోను ఉన్న సర్వ తీర్దాలు సన్నిహిత తీర్ధంలో కలుస్తాయి. పాపులైన మానవులు ఈ తీర్దంలో స్నానమాచరిస్తే పాపాలు పటా పంచలై, పాప రహితులై మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. ఈ సన్నిహిత తీర్ధాన్ని బ్రహ్మ దేవుడు నిర్మించాడని నారదపురాణం చెపుతుంది. కురుక్షేత్రంలో సన్నిహిత తీర్దంలో సూర్యగ్రహణం నాడు స్నానం చేయడం ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.ఇక్కడ ఉన్న దృవ నారాయణ మందిరంలో శ్రీమన్నారాయణుడు నాలుగు భుజాలతో దర్శనమిస్తాడు. అంతేకాకా మహభక్తుడైనా దృవుడి సుందర ప్రతిమలు సందర్శకులకు అపురూపమైనా ఆనందాన్ని కలిగిస్తాయి.

ఈ మందిరానికి కొద్ది దూరంలో హనుమంతుడి విగ్రహం, సింహ వాహిని, అష్ఠ భుజాలు కలిగిన దుర్గాదేవి యోక్క పాలరాతి విగ్రహం ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా యాభై రెండు ద్వాదశుల భారి మేళాను నిర్వహిస్తారు. శ్రీ రామా చంద్రుడు కూడా సీతా సమేతంగా ఈ తీర్దంలో సూర్య గ్రహణ స్నానం చేసి గుర్రలను, ఒంటెలను, రధాలను దానం చేశాడని పూరాణాలు చెపుతాయి.తీర్ద పూరోహితులు:సన్నిహిత సరోవర తీర్ద సరోవర తీరంలో నివసించే తీర్ద పురోహితులవద్ద ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే యాత్రికుల సంబందించిన వందల సంవత్సరాల నాటి వివరాలు లభిస్తాయి. పండితులు మహరాజులు కురుక్షేత్రాన్ని సందర్శించి దాన ధర్మాలు చేసేవారు. దక్షిణలు సమర్పించేవారు.

వారు తమ పూర్వికుల యోక్క శ్రద్ద కర్మలను నిర్వహించేవారు. సిక్కుల గురువైనా గురుగోవింద్ సింగ్ కురుక్షేత్రాన్ని సందరిశంచినట్లు తెలిపే సాక్ష్యాలు తీర్ద పూరోహితులైనా రాజ్ కిషన్, పవన్ ప్రసాద్ ల వద్ద లభిస్తాయి.విష్ణుదత్ మిశ్ర వద్ద కులు కు చెందిన రాజులు, మధ్యప్రదేశ్ కు చెందిన యాత్రికులు వివరాలున్నాయి. నేపాల్ కు చెందిన తీర్ద పురోహితులు లజ్జారాం జోషి, నుండి సాకేత్ మరియు బిలాస్‌పూర్ కు చెందిన శ్రీ హరినారాయణ్ , సిమ్లా కి చెందిన షాదీ రావ్‌ు మహవీర్ ప్రసాద్ గ్వాలియర్ కి చెందిన పండిట్‌ఓంకార్ నాధ్, సామ్రాజ్యానికొ చెందిన రామేశ్వర్ ఉదయ్ పూర్, చంచాకి చెందిన కేసర్ దేవ్ శాస్రి, జలంధర్ కి చెందిన కాకారావ్‌ు, పండిత్ మదన్ లాలా వద్ద రాజులు,మహరాజులకు సంబంధించిన వందలాది సంవత్పరాల రికార్డులు (వివరాలు)న్నాయి.ఈ తీర్ధానికి వచ్చిన యాత్రికులు స్నానాలు చేసిన తరువాత ఆక్కడి రికార్డులు తమ వివరాలు రాసి సంతకాలు చేసి, పూరోహితులకు దక్షిణలు సమర్పిస్తారు.అంతేకాకుండా ,ఆరికార్డుల్లో తయ పూర్వికుల యోక్క వివరాలు చూసి మహదానందాన్ని పోందుతారు. ఈ తీర్దం తీరాన అనేక మందిరాలున్నాయి. ఖుష్ వాహ శివ ప్రతిమా,దృవ నారాయణ మందిరంలోని హనుమంతుని ప్రతిమ, దుర్గదేవి విగ్రహలు, సంతోషిమాత మందిరం, సూర్యదేవర మందిరం,సీ ఖ్ వాలా లక్ష్మి నారాయణ మందిరం, దు:ఖభంజనేశ్వర మందిరం మొదలైన మందిరాలు తప్పకుండా సందర్శించ వలపిన క్షేత్రాలు, అంతే కాకుండా క్రోత్తగా నిర్మించిన కృష్ణధామం, శ్రీ గీతా ధామం మొదలైనవి కూదా ఉన్నాయి.

బ్రహ్మ సరోవరం:బ్రహ్మ సరోవరం మొదట చాలా విశాలంగా ఉండేది, కాని కురుక్షేత్ర బోర్డు అభివృద్ది కోసం చాలా వ్యయ ప్రయాసాల కొర్చి పాత సరోవరం పరిమాణంలో 3 వంతు పరిమాణంలో గల అత్యాదునిక సరోవరాన్ని నిర్మించారు.ఈ సరోవరం 3,600 ఆడుగులు, వెడల్పు 1200 అడుగులు, లోతు 15 అడుగులు. ఇక్కడ యాత్రికుల సౌకర్యం కోసం విశ్రాంతి గృహలు, సరోవరవ చుట్టూ రెయిలింగ్ నిర్మాణం కూడా చేశారు.మహిళల కోసం ప్రత్యేక మైన ఏర్పాట్లు చేశారు.పదిహేడవ శతాబ్ధానికి చెందిన మహంత్ శ్రవణ్ నాధ్ నిర్మించినట్టు చెబుతారు.సూర్యగ్రహణ సందర్భంగా దాదాపుగా 5 లక్షల మంది దాకా స్నానం చేసి తరిస్తారు.బ్రహ్మ సరోవరంలోనే భారత యుద్దం చివరి రోజున ధుర్యోధనుడు దాక్కున్న సరస్సు ఇదేనని చాలా మంది భావిస్తారు.కాని సరశరమని పిలిచే ఈ సరస్సు ధానేసర్ కు సూమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉంది.బ్రహ్మ సరోవరరాన్ని కురు మహరాజు కోసం బ్రహ్మ దేవుడు నిర్మించాడు.ఇక్కడ స్నానమాచరింటడం పూర్వజన్మ సుకృతం.
శ్రీలక్ష్మి నారాయణ మందిరం:శ్రీ లక్ష్మి నారాయణ మందిరము సన్నిహిత సరోవరానికి పశ్చిమాన ఉంది. ఈ మందిరంలో శ్రీ లక్ష్మి నారాయణ ప్రతిమ చూడ ముచ్చటగా ఉండిభక్తులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది.సిద్దుడైన శివబాబా ఈ శ్రీ లక్ష్మి నారయణ మందిరాన్ని నిర్మించి, ఈ జగత్తును పరిపాలించే వారిని భక్తుల కోరికలను తీర్చడానికి ,ఈ క్షేత్రానికి వచ్చిన వారిని తరింపచేయడానికి స్వీమి ఇక్కడ వేంచేపినట్టుగా చెపుతారు.

సర్వేశ్వర మందిరము: కురుక్షేత్ర సరోవరపు మధ్యభాగాన ఉన్న శంకరుడి ప్రాచీన మందిరానికిచిన్న వంతేన ద్వారా చేరుకోవచ్చు. ఈ మందిరానికి నాలుగు వైపులా నీరున్న ఈ మందిరాన్ని బాబా శ్రవణ్ నాధ్ నిర్మించారు. ఈ మందిరంలో మొత్తం ఐదు భాగాలున్నాయి ఈ ఐదు భాగాలు ఐదు శిఖరాల రూపంలో బయటికి స్పష్ఠంగా కనిపిస్తాయి. మధ్యభాగాన శివలింగం,శివపార్వతి మూర్తులు, గణపతి, నంది విగ్రహలు మరోభాగంలో గరుడ నారయణుడి పాలరాతి ప్రతిమలు ఉన్నాయి.ఇతర భాగాల్లో హనుమ, మహమయి రాధా కృష్ణుల ప్రతిమలున్నాయి. ఇదే దేవాలయంలో కుంతిదేవి శంకరుణి స్వర్ణ కమలాలతో ఆర్చించేదని ప్రతీతి.

స్థానేశ్వర మహదేవ మందిరము:ధానేసర్ పట్టణాన్ని రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఈ మహదేవున్నిమందిరాన్ని దర్శించే మానవుల సకల పాపాలు హరింపబడి, పరమ పదన్ని చేరుకుంటారని ప్రతీతి.పురాణాల్లో స్థానేశ్వరుడి గురించి ఈ స్థల మహత్యన్ని చాలా విశేషంగా ప్రస్తావించారు.తెలిసో,తెలియక మానవులు చేసిన పాపాలు “ స్థాణు” తీర్ధాన్ని దర్శించగానే పటా పంచలవుతాయి. స్థాణు లింగాన్ని చూసిన,సృష్ఠించిన ముక్తి లభిస్తుంది. భారత యుద్దనికి పూర్వమే పాండవులతో కలిసి శ్రీ కృష్ణడు ఈ క్షేత్రాన్ని దర్శించి, స్థాణు లింగాన్ని పూజించాడని చెపుతారు.ఈ క్షేత్రాన్ని దర్శించకుండా కురుక్షేత్ర యాత్ర నిష్ఫలం, సంపూర్ణం కాదని ప్రతీతి. ఈ సాణిశ్వ క్షేత్రానికి ఉప్న మరో విశేషం, ఈ స్వామి కురుక్షేత్రానికి అధిపతి అని కూడా భావిస్తారు.

జ్యోతిసర్ తీర్థం:సరస్వతి నదీ తీరాన జ్యోతిసర్ గ్రామం ఉంది. ఇక్కడే మహభారత సంగ్రామంలో శ్రీ కృష్ణడు అర్జునుడికి గీతోపదేశం చేసిన స్థలం ఉంది. ఇక్కడఅతి ప్రాచీన సరోవరము, గీతోపదేశం చేసిన సాక్షిగా వట వృక్షం ఉంది. ఈ వట వృక్షం కిందనే గీతోపదేశం జరిగింది. దీనినే అక్షయ వటవృక్షమని అంటారు.అద్భుతమైన ఈ వృక్షన్ని చూసి ప్రతి భారదీయుడు తప్పక తరించాల్సిందే. కురుక్షేత్ర దర్శనం, వటవృక్ష వీక్షణం చేసుకోక పోతే మానవ జన్మ వ్యర్ధమనే భావించాలి. కృష్ణ పరమాత్మ నడయాడిన నేల గీతోపదేశం చేసిన స్థలం జ్యోతిసర్.

భీష్మ కుండం:నరకాతరి అనే స్థలంలో కురుక్షేత్ర సంగ్రామంలో భాణాల గాయలతో చిధ్రమైన శరీరంతో అంపశయ్య మీద భీష్మపితామహుడు ఉత్తారాయణ పుణ్యకాలం కోసం, తద్వారా తన ఆత్మ శరీరాన్ని వదిలి పెట్టెవరకు భీష్ముడు ఉన్న స్థలమే ఈ భీష్మకుండం. భీస్ముడు దాహంగా ఉందని త్రాగడానికి మంచి నీళ్ళు కావాలని అర్జునుని కోరగా అర్జునుడు బాణాలు వేసి పాతాళ గంగను రప్పించి భీష్ముడి దహన్ని తీర్చిన స్థలం ఇది.అంతేకాకుండా “విష్ణు సహస్ర నామ స్తొత్రం” కూడా జన్మించిన పవిత్ర స్థలం .భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలను ఉపదేశించిన స్థలం ఇది. ఇప్పటికి కూడా కురుక్షేత్రంలని ఈ స్థానంలో జల నిధి తరువాత భీష్మపితామహుడు అంపశయ్య మీద పడుకుని ఉన్న ప్రతిమటు ఈ ప్థలాన్ని దర్శించేవారికి ఉద్వేగా భరితమైన జ్ణాపకాలను కలిగిస్థాయి. కళ్ళకు కట్టినట్లు గా కౌరవ, పాండవ సంగ్రామంలో భీష్ముడు త్యాగం ప్రతీ భారతీయుడి మస్తాష్కవ మీద ఆవిష్ర్కుతమవుతుంది.ప్రతీ భారతీయుడు తప్పాకుండా చూడవలసిన క్షేత్రం ఇది.ఇంతే కాకుండా కురుక్షేత్రంలో చూడవలసిన తీర్ధాలు, క్షేత్రాలు చాలా ఉన్నాయి.అందులో ముఖ్యమైనవి చంద్రకూపం, గీతాభావన్, బిర్లామందిర్,భద్రకాళీ మందిరము, నాభికమల్ మందిరము,ఆప్ గా తీర్దం, కామ్యాతీర్దం, కూబేర తీర్దం, మార్కండేయ తీర్దం, శుక్ర తీర్దం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.

Comments

comments