Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం

ministr

నేడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి చేతుల మీదుగా

ప్రారంభోత్సవం కానున్న డయాలసిస్ కేంద్రం 

వికారాబాద్ జిల్లా : వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ (రక్త శుద్ధి) కేంద్రాన్ని ఈ నెల 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంకు కేటాయించిన చాంబర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి 5 డయాలసిస్ యంత్రాలను, తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో 10 డయాలసిస్ యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. డయాలసిస్ చికిత్స చేయడానికి ఉపయోగించే ఆర్‌ఎం ప్లాంట్ ఏర్పాటు కూడా పూర్తి అయింది.  ప్రముఖ జర్మనీ సంస్థతో డయాలసిస్ కేంద్రం నిర్వాహణకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో యంత్రంపై ఒక్క రోజులో నలుగురికి డయాలసిస్ చేస్తుంది, ప్రతి రోజు 20 మంది రోగులకు డయాలసిస్ చేసే అవకాశముంటుందని వైద్యాధికారులు పేర్కోంటున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌లో డయాలసిస్ కేంద్రం లేకపోవడం వలన కిడ్నీ రోగులు హైద్రాబాద్‌కు వెళ్తున్నారు. డయాలసిస్ చేసుకోవాల్సిన రోగితో పాటు మరోకరు సహాయంగా వెళ్లాల్సి వస్తుంది. హైద్రాబాద్ వెళ్లిన ప్రతిసారి2 వేల రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకు వ్యయమవుతుంది. పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నవారి ఒకసారి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పదిసార్లు డయాలసిస్ చేసుకునే వీలుంటుంది. లేనిపక్షంలో సిఎంఆర్‌ఎఫ్ నుంచి అనుమతి తీసుకుని ఉండాల్సి ఉంటుంది. వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో డిమెడ్ హెల్త్ కేర్ సంస్థ డయాలసిస్ సేవలందించనున్నది. ఆసుపత్రి యజమాన్యం వీరికి హౌజ్ కీపింగ్, విద్యుత్, ఇంజక్షన్లు, మంచినీరు, సెక్యూరిటీ తదితర వసతులను ఒప్పందం ప్రకారం కల్పిస్తుంది. డయాలసిస్ కేంద్రంలో డి మెడ్ హెల్త్ కేర్ సంస్థకు చెందిన ఇద్దరు వార్డు బాయ్‌లు, ఒక సిస్టర్, ఒక టెక్నిషియన్ ఒక సిప్ట్‌లో ఉంటారు. డయాలసిస్ కేంద్రంలో మూడు షిప్ట్‌లలో సిబ్బంది 24 గంటలపాటు విధులు నిర్వహిస్తారు. డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడంతో వికారాబాద్ ప్రాంతం ప్రజలతోపాటు చుట్టుపక్కల పేద ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments