Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రాష్ట్రంలో నియంత పాలన

 CPI

ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి

తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన

ప్రజావ్యతిరేక విధానాలను  అవలంభిస్తున్న కేసిఆర్ 

దోపిడీకి గురువుతున్న తెలంగాణ వనరులు 

ప్రజలను చైతన్య పర్చేందుకే పోరుబాటు

సిపిఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి 

ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ రాలేదని తెలంగాణలో రజాకార్ల పాలన కొనసాగుతుందని సిఎం కేసిఆర్ నియంతలా వ్యవహరిస్తూ మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మంచిర్యాలజిల్లా కేంద్రంలో నిర్వహించిన సిపిఐ  పోరుబాట బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేసిఆర్‌కు ప్రజలు చరిత్రను తిరుగరాసే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని ఉద్యమా లు, త్యాగాలు చేసి, సాధించుకున్న తెలంగాణ ఎవరిపాలైందో అ ర్థం  కావడం లేదని ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడంలో గోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ సాధించుకుంటే తమ కలలు సాకారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు ఆశించగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసిఆర్ కుటుంబం రాజ్యమేలుతోందని, ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం,సమగ్రాభివృద్ధి ఆచరణకు నోచుకోలేదని, ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజాసమస్యలను పట్టించుకోకుండా నియంతృత్వ దోరణనిని అవలంభిస్తున్నారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అందరికి విద్య, వైద్యం, తదితర ఆకాంక్షలతో తెలంగాణ ఉద్యమం కొనసాగగా తెలంగాణ సాధించుకున్న తరువాత కేసిఆర్ దొరల పాలన కొనసాగిస్తూ ప్రజలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎటువైపు పయనిస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావిస్తే తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా పునరావృతం అవుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారని తెచ్చుకున్న తెలంగాణలో యువతకు న్యాయం జరగడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సిఎం కేసిఆర్ కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా మిగిత నోటిఫికేషన్లు కోర్టులో మగ్గిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో పోలీసులు సైతం నిరంకుశ నియంతృత్వ వైఖరిని అవలంభిస్తూ ఉద్యమాలపై నిర్బంధం మోపుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విదానాలకు పాల్పడుతున్నాయని, నోట్ల రద్ధు వలన నల్లధనం వెలికి రాకపోగా సామాన్యులు ఇబ్బందులకుగురయ్యారన్నారు. జిఎస్‌టి పేరుతో పేదలపై మరింత భారం మోపారని ఒకే పన్ను ఒకే దిశ అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ చేనేత వస్త్రాలు ఆహార పదార్ధాలుపై వేసిన జిఎస్‌టి డీజిల్, పెట్రోల్‌పై జిఎస్‌టి ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు.
ప్రజలను చైతన్యం చేసేందుకు చేపట్టిన సిపిఐ పో రుబాట 39 రోజులుగా కొనసాగుతూ మంచిర్యాలకు చేరుకుందని యాత్రలో భాగంగా 319 మండలాలు 4292 కిలోమీటర్ల పొడవున యాత్ర కొనసాగిందన్నారు. పోరుబాట యాత్ర వచ్చే నెల 3న కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. యాత్రలో ప్రజాసమస్యలపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని స్పందిచకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సిద్దం అవుతామన్నారు. అనంతరం ప్రజాయుద్దనౌక గద్దర్ మాట్లాడుతూ ఎంతో మంది యువకులు ప్రాణాలు దారబోసి తెచ్చుకున్న తెలంగాణ దొరలపాలైందని ఆరోపించారు. ప్రభుత్వ దోపిడిపై దండయాత్ర కొనసాగిస్తామన్నారు. సిపిఐ చేపట్టే ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వామ్యులుకావాలని పిలుపునిచ్చారు. ఈబహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్, ఎన్.బాలమల్లేష్, పశ్య పద్మ, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎండి యుసూఫ్, మహిళల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సృజన, బిసి సబ్‌ప్లాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. పాండురంగచారి, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాముల్‌యాదవ్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మినారాయణ, రాష్ట్ర అధ్యక్షులు పల్లె నర్సింహ, మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు శ్రావణి, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణశంకర్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ధూంధాం కళాకారుడు అంతడుపుల నాగరాజు, ఏపూరి సోమన్న, తదితరులు పాల్గొన్నారు.

 

 

Comments

comments