Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

రాష్ట్రలో నియంతృత్వ పాలన

cpm

హసన్‌పర్తి: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర బుధవారం హసన్‌పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు గోలి రాజిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర బృందానికి ఘనంగా స్వాగ తం పలికారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ సిఎం కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి కుటుంబపాలన కొనసాగిస్తూ బంగారు కుటుంబంగా కొనసాగుతున్నాడని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం, ఇంటికో ఉద్యోగం, నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు వంటి హామీలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మార్కిస్టు పార్టీ లు, ప్రజాసంఘాలు, మేధావులు అందరు ఐకమత్యంతో పోరాడి సామాజిక తెలంగాణ లక్షంగా అన్ని శక్తులు ఏకమై టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు గిన్నారపు రోహిత్, గోపు బుచ్చిరెడ్డి, గడ్డం రాజమౌళి, వెంకటేశ్వర్లు జక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments