Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

కార్యనిర్వహణ పట్టిక ద్వారా తొలగనున్న ఇబ్బందులు

sir

*అర్జీదారులకు తప్పిన ఆర్థిక, వ్యయప్రయాస భారం

*ఆర్‌డిఓ కార్యాలయంలో ఏర్పాటు – ప్రజా సమస్యల పరిష్కారం సులభతరం
*నల్లగొండ ఆర్‌డిఒ వెంకటాచారీ

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు సంబంధిత అధికారి అందుబాటులో లేకుంటే తీవ్ర ఇబ్బ ందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ కార్యాలయం చుట్టూ తిరగ డానికి జనం పనులు మానుకోవాల్సిరావడం, ఆర్ధిక భారం, వ్యయప్రయా సల కు లోనుకా వల్సి వస్తుంది. ఒక సామాన్య మాన వునిగా ప్రజా ఇబ్బందులపై దృష్టి సారించిన నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారీ ఆర్డీఓ కార్యాలయంలో పనుల కార్యనిర్వహణ కాలనిర్ణయ పట్టికను ఏర్పాటు చేశారు. వారంలో ఏ రోజు ఏ పనులు జరుగుతాయన్న సమాచారం పొందు పరిచిన బోర్డును కార్యాలయ గోడకు అమర్చారు. సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ, సమీక్ష, మంగళవారం వయోవృద్దుల సంర క్ష ణ చట్టం అప్పీళ్ల విచారణ, బుధ వారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్, గు రు వారం సమాచార హక్కు చట్టం అప్పీ ళ్ళ విచారణ, శుక్రవారం భూ సేకరణ సమీ క్ష, గ్రీన్‌డే పాటించుట, శనివారం కార్యాలయ సిబ్బ ం ది పనితీరుపై సమీక్ష- భూమి హక్కు చట్టం అప్పీళ్ళ విచారణ కార్యక్రమాల నిర్వహణ వివరాలు పొందు పరిచారు. రాష్ట్ర ఆవి ర్భావం, జిల్లాల పునర్వివిభజన వల్ల ఉద్యోగులపై పనిభారం అధికమైంది. ఇంటింటి సర్వే, హరితహరం, మిషన్ భగీరథ, మిషన్ కాక తీయ పనుల పరిశీలన, భూసర్వే, భూరికార్డుల నవీకరణ లాంటి కార్యక్రమాల వల్ల అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి రావడంతో పలు సమయాల్లో ప్రజలకు అధికా రు లు కార్యాలయాల్లో అందుబాటులోకి రావడం లేదు. పలు సమ స్యలపై ఒకే రోజు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు కార్యాలయానికి రావ డంతో వారి సమస్యలన్నింటిని సమీక్షించే సమయం అధికా రులకు తీరి కలేదు. దీంతో ఒక సమస్యపై పలుమార్లు కార్యాలయానికి తిరిగే ఇబ్బ ందు లను తొలగించేందుకు ఆర్డీఓ కార్యాలయ నిర్వహణ పట్టికను కార్యనిర్వాహన ద్వారా తొలగనున్న ఇబ్బందులు.  ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఆర్డీఓ వెంకటాచారీ మాట్లాడుతూ కార్యనిర్వహణ పట్టిక ద్వారా ప్రజలకు, అధి కారులకు ఉపయోగకరంగా వుంటుందని అన్నారు. అన్ని పనులపై ఒకే సారి పౌరులు కార్యాలయానికి రాకుండా తమకు సంబంధించిన పనుల నిర్వహణ రోజున కార్యాలయానికి వచ్చి సమస్య పరిష్కారానికి సరైన మార్గాన్ని పొందే విధంగా కార్యనిర్వహణ పట్టిక ఉపయోగపడుతుందన్నారు. వయోవృద్దుల సంరక్షణ చట్టం అప్పీళ్ళ స్వీకరణ ప్రారంభించిన తరువాత ప్రతి రోజు ఎవరో ఒకరు కార్యాలయానికి వచ్చి కుటుంభ సభ్యులు ఆదరించడంలేదని వినతి పత్రం ఇచ్చి మరో రెండు రోజులకు వచ్చి మా పిటీషన్‌ను విచారించారా అని అడుగుతుండేవారని కార్యనిర్వహణ పట్టిక ఏర్పాటు చేసిన తరువాత విచారణకు మంగళవారం మాత్రమే హజరవుతున్నారని దీనివల్ల వృద్దులకు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగే ప్రయాస, ఆర్ధిక ఇబ్బంది తొలగిందన్నారు. బోర్డులో పేర్కొన్న విధంగా రోజువారి కార్యక్రమాలను పాటిస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ప్రజలు దీనిని వినియోగించుకోవాలని అన్నారు.

Comments

comments