Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

విధులలో నిర్లక్షం వీడండి

LADY

*ఈ- ఔషధిలో ఓపి పేషెంట్ల వివరాల నమోదులో ఫార్మాసిస్టులు నిర్లక్షం ఎందుకు
*ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే ఇంట్లో కూర్చోవాలి
*వేతనాలను ఆపి వేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశం
*మండలాల పిహెచ్‌ల కంటే నర్సాపూర్, మెదక్ ఆసుపత్రులే వెనుకంజ
*సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: జిల్లాలోని అన్ని పిహెచ్‌సి సెంటర్లలో ఈ ఔషధి కార్యక్రమంలో భాగంగా ఓపి పేషెంట్ల వివరాల నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ భారతిహోళికేరి ఫార్మాసిస్టులను సూచించారు. సోమవారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓలు, పిహెచ్‌సీలలోని ఫార్మాసిస్టులతో ఈ- ఔషధి కార్యక్రమ నిర్వాహణ, ఓపి పేషెంట్ వివరాల నమోదుపై సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలోనే పెండింగ్‌లో ఉన్న ఓపి పేషెంట్ల నమోదు వివరాలను ఆన్‌లైన్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటి పూర్తి చేయలేదని ఫార్మాసిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్షం వహిస్తున్న ఫార్మాసిస్టుల వేతనాలను నిలిపివేయాలని, పెండింగ్‌లో ఉన్న వివరాలను నమోదు చేసేంతవరకు వేతనాలు చెల్లించకూడదని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మెదక్, నర్సాపూర్ ఆసుపత్రుల్లో సైతం వివరాలను నమోదు చేయడంలో నిర్లక్షం వహిస్తున్నారని, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల కంటే తక్కువగా నమోదు కావడమేంటని, పట్టించుకోరా అని ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లను ప్రశ్నించారు. జిల్లాలోని ఏయే పిహెచ్‌సిలలో వివరాలు తక్కువగా నమోదు చేశారో తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. ఏ రోజు నిర్వహించాల్సిన పనిని ఆ రోజు నిర్వహిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదని, ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే ఇంట్లో కూర్చోవాలని, వేరే వారు ఉద్యోగాలు చేసేందుకు సిద్దం గా ఉన్నారని తెలిపారు. ఇకనైనా విధుల్లో శ్రద్దవహించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశిచారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటి డిఎం అండ్ హెచ్‌ఓలు, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments