Search
Friday 20 April 2018
  • :
  • :

ఉపాధిహామీ, పింఛన్ డబ్బుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దు

madamమనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: ఉపాధిహామీ కూలీ డబ్బులు, పింఛను డబ్బుల చెల్లింపులో జాప్యం చేసి ప్రజలకు ఇబ్బందులను కలిగించకూడదని జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి బ్యాంకర్లు, పోస్టాఫీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేటులోని సమావేశ మం దిరంలో పింఛన్, ఉపాధిహామీ కూలీ డబ్బుల చెల్లింపులపై బ్యాం కర్లు, పోస్టాఫీసు, ఈజిఎస్ సిబ్బందితో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న బ్యాం కు శాఖ ల్లో డబ్బులు తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గ్రామాల్లోని పోస్టాఫీసు ద్వారా డబ్బులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. కానీ సంబంధిత పోస్టాఫీసుల్లో డబ్బులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటి నుండి ఈ సమస్య పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎల్‌డిఎం మరియు పోస్టాఫీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. కూలీ చేసిన అనంతరం సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ప్రజలు కూలీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయరని అలాంటప్పుడు జిల్లా కు నిర్ధేశించిన లక్షాన్ని చేరుకోవడం కష్టతరం అవుతుందన్నారు. బ్యాంకులు, పో స్టాఫీసుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న డ బ్బులు త్వరితగతిన ప్రజలకు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధా న చేయాలని ఎపివోలను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఓ సీతారామారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగరాజు, మెదక్ పోస్టల్ సూపరింటెండెంట్ సురేష్‌కుమార్, హెచ్.ఆర్ మేనేజర్, రాజేందర్‌రెడ్డితో పాటు ఎపిఓలు పాల్గొన్నారు.

Comments

comments