Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

kilo

జగిత్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి

మనతెలంగాణ/రాయికల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు ఇబ్బంది కలిగించవద్దని జగిత్యాల ఎంఎల్‌ఎ తాటిపర్తి జీ వన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.రాయికల్ మండలం అల్లీ పూర్, అయోధ్య,ఆలూర్, ఇటిక్యాల గ్రామంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దళారుల నుంచి రైతులను రక్షించి మద్దతు ధర అందించాలనే ఉద్దేశ్యంతో అనాటి వైఎస్సార్ ప్ర భుత్వం గ్రామాల్లో ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ందని గుర్తు చేశారు. అదే ఒరవడిని ఇప్పటి ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని అయితే ప్రస్తుతం ఐకెపి ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలేత్తే పరిస్థితి ఉందని చెప్పారు. అయితే మండల, గ్రామ స్థాయి అధి కారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. సరిపడ గన్నీ సంచులు, హామాలిల కొరత లేకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే కొనుగోళ్లు జరు పాలని వివరించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి మద్దత ధర పొందాలని సూచించారు. పొరుగు రా ష్ట్రాలు రైతులకు తమ పంట ఉత్పత్తులపై బోనస్ అందిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం బోనస్ విషయంలో నిర్లక్షం ప్రదర్శిం చడం భావ్యం కాదన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఈ సీజన్‌లో వరి పంటకు దోమపోటు తగిలి రైతులకు పంట ది గుబడి తగ్గిందని తెలిపారు.
ప్రభుత్వం దోమ పోటుతో పంట నష్టపోయిన రైతులను తక్ష ణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పిపి పడాల పూర్ణిమా తిరుపతి, జెడ్పిటిసి గోపి మాధవి రాజరె డ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్శన్ ఎనుగందుల ఉదయశ్రీలింగం గౌడ్, కెడిసిసి డైరెక్టర్ పడిగెల రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్య క్షుడు వెంకటేశ్వర్‌రావు, కొండపెల్లి రవీందర్‌రావు,కాటిపెల్లి నా రాయణరెడ్డి,సర్పంచ్‌లు బాలే శోభారాణి, ఎడ్మల శారద,మె క్కొండ రాంరెడ్డి, నీరటి శ్రీనివాస్, ఎంపిటిసిలు అత్తినేని గం గారెడ్డి, లాల్‌చావ్లా రాజేశ్, సిరిపురం లక్ష్మి, ఏముల సింధూజ మురళి, పార్టీ నాయకులు గుర్రం మహేందర్‌గౌడ్, కొయ్యడి మ హిపాల్‌రెడ్డి, ఎద్దండి దివాకర్‌రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, తలారి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments