Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసమే మిషన్ భగీరథ

padmaత్వరలో ఇంటింటికి నల్లానీరు

రాష్ట్రంలో 94 వేల కోట్లతో 24 గంటల కరెంట్
రేషన్ బియ్యం బందుకావు

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

రామాయంపేట: ఆడ బిడ్డల ఆత్మగౌరవం కోసమే  మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె బుధవారం రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్‌లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీళ్ల కోసం ఆడ బిడ్డలు బిందెలు పట్టుకుని తిరగద్దనే ఉద్దేశ్యంతోనే ముఖ్య మంత్రి మిషన్ భగీరథను చేపట్టారని, సింగూరు నుంచి  ఇంటింటికి  మంచి నీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 94 వేల కోట్లతో 24 గంటల కరెంట్‌ను ప్రభుత్వం అందిస్తుందని ఇక ఎక్కడా కరెంట్ తిప్పలు లేవన్నారు. వితంతువు, వృద్ధాప్య, గీతా కార్మికులకు పింఛన్లను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. చెరువులు బాగుంటేనే రైతులు బాగుంటారన్న ఉద్దేశ్యంతో మిష న్ కాకతీయ చేపట్టామన్నారు. అలాగే రైతుల దళారుల బారిన పడకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. రేషన్ బియ్యం బందు అవుతుందని ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదన్నారు. రైతులు తాము పండించిన పంటలకు తామే ధరలు నిర్ణయించుకోవాలన్నారు. వారు సంఘటితంగా ఉండాలని సూచించారు. జాన్సీలింగాపూర్‌లో 15 రోజుల్లో పైపులైన్ పనులను పూర్తి చే యాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామానికి రూ.64 లక్షలు సిసిరోడ్డు పనులకు నిధులు మంజూరి అయ్యాయని, అట్టి పనులు త్వరలో ప్రారంభ మవుతాయని తెలిపారు. స్థానిక పాఠశాలకు రెండు అదనపు గదులను, గ్రామ పంచాయతీ భవనం, దానికి ప్రహరీ, మహిళా భవనం మంజూరికి స్థానిక సర్పంచ్ విన్న వించుకోగా దానికి ఆమె సానుకూలంగా స్పందించి వాటి మంజూరికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పుట్టి విజయలక్ష్మి, వైస్ ఎంపిపి జితేందర్‌గౌడ్, జెడ్‌పిటిసి బిజ్జ విజయలక్ష్మి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య,ఎంపిటిసి సుగుణా రఘుపతిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, వైస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, పేట సర్పంచ్ పాతూరి ప్రభావతి, ఆత్మ చైర్మన్ రమేశ్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పట్టనాధ్యక్షుడు పుట్టి యాదగిరి, నాయకులు సరాఫ్ యాదగిరి, నర్సారెడ్డితో పాటు తదితరులున్నారు.

Comments

comments