Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ఇరాక్, ఇరాన్ సరిహద్దులో భూకంపం

earth

400 మంది మృతి
వేలాది మందికి గాయాలు

టెహ్రాన్ : ఇరాక్‌ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ భూకంపం విలయాన్ని సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైన ఈ ప్రకృతి విపత్తుతో రెండు దేశాలకు చెందిన 400 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 6,700 మంది గాయపడినట్టు స్టేట్ టెలివిజన్ పేర్కొంది. భవనాలు, ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. భూకంపం సంభవించిన ఈశాన్య ఇరాక్‌లోని కెర్మన్‌షా ప్రొవిన్స్‌లో భూభాగం పూర్తిగా గ్రామీణ ప్రాంతం, కొండలతో కూడిన ఈ భూముల్లో వ్యవసాయంపైనే ఇక్కడి ప్రధానంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ భూకంపం వల్ల కనీసం ఏడుగురు మరణించగా, 535 మంది గాయపడినట్టు ఆ దేశ మంత్రి తెలిపారు. తూర్పు ఇరాక్ హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని యుఎస్ జియాలజీ సర్వేలో గుర్తించారు. ఈ నగరం ఎపిక్ సెంటర్‌కు సమీపంలోనే ఉంది. 1988లో సద్దాం హుస్సేన్ హయాంలో జరిగిన రసాయన దాడిలో 5వేల మంది మృత్యువాత పడిన ఘటన ఎపిక్ సెంటర్‌లో జరిగింది. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలకు ఇళ్లలోంచి హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు, వీడియోలను సోషల్ మీడియా, న్యూస్ ఏజెన్సీల్లో చూపించారు. సత్వరమే సహాయ, పునరావాస కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా సివిల్ డిఫెన్స్ బృందాలు, సంబంధత సంస్థలలకు ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సంతాపాన్ని ప్రకటించిన టర్కీ వెంటనే ఇరాక్‌కు అత్యవసర సహాయాన్ని అందించింది.

Comments

comments