Search
Monday 11 December 2017
  • :
  • :

‘ఏక్ దిల్.. ఏక్ జాన్’ అంటున్న ‘పద్మావతి’

Padmavathi

బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పద్మావతి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ‘పద్మావతి’ సినిమాలోని ‘ఏక్ దిల్.. ఏక్ జాన్’ అంటూ సాగే వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎప్పటిలాగే బన్సాలీ తనదైన శైలిలో రిచ్‌నెస్‌తో పాటను సూపర్బ్ గా తెరకెక్కించాడు. ఇక పాటపై దీపికా, షాహిద్ల కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. రాణి పద్మినిగా దీపికా, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్, మహారావల్ రతన్ సింగ్‌గా షాహిద్ నటించారు. కాగా, ఇప్పటికే ఈ చిత్రాన్ని ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. వివాదాల ద్వారానే ఈ మూవీ సగం ప్రమోషన్ కొట్టేసిందనే చెప్పాలి. ‘పద్మావతి’ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా విడుదలైన ‘ఏక్ దిల్.. ఏక్ జాన్’  వీడియో సాంగ్ మీ కోసం…

Comments

comments