Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కొత్త ఏడాది నుంచి నిత్య వెలుగులు

 

kcr

జనవరి 1 నుంచి నిరంతర సాగు విద్యుత్ 

ఇక విరామం లేకుండా వెలుగులు ప్రసరిస్తాయి

స్వర్ణయుగంలోకి అడుగు పెడతాం

రైతులు ఆటో స్టార్టర్లను తొలగించాలి

డిసెంబర్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం

భూ రికార్డులకు, రైతు సమన్వయ సమితులకు సంబంధం లేదు

శాసనసభలో చర్చకు సమాధానమిస్తూ సిఎం కెసిఆర్

తెలంగాణ కోసం పేగులు తెగేదాకా
కొట్టాడినారు

రైతు సమన్వయ  సమితుల్లో టిఆర్‌ఎస్ కార్యకర్తలను చేర్చుకొని తీరుతాం :  సిఎం 

ఏ అధికారం, ఏమీ లేకపోయినా అటుకులు బుక్కో, అన్నం తినో, తినకో నీళ్లు తాగో బక్క, పేద టిఆర్‌ఎస్ కార్యకర్తలే 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు. మీరు పదవులల్ల సేద తీరిన నాడు, వారిని జైలులో వేసిన నాడు పేగులు తెగేదాకా కొట్లాడినారు. వాళ్లే రైతు సమితుల్లో ఉంటారు. 

హైదరాబాద్ : రాష్ట్రంలో 2018 జనవరి 1వ తేదీ నుంచి ప్రజలందరికీ 24 గంటల విద్యుత్‌ను సరఫ రా చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. రైతులంతా ఆటో స్టార్టర్‌లను తొలగించాలని, డిసెంబర్‌లో ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు సమన్వయ సమితులలో టిఆర్‌ఎస్ కార్యకర్తలకు అవకాశం ఇచ్చి తీరుతామన్నారు. రైతు సమన్వయ సమితులకు ఎలాంటి అధికారాలు, జీతాలు ఉండబోవని, భూరికార్డులకు సమితులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశా రు. వక్ఫ్ భూములు, దేవాదాయ భూములతో పాటు పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి రుణమాఫీ సహాయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమితుల్లో రైతులు కానివారిని సభ్యులుగా నియమించడం సరికాదని, అలాంటిది ఏవైనా ఉంటే వెంటనే సరి చేస్తామన్నా రు. శాసనసభలో ‘రైతు సమన్వయ సమితులు, రైతులకు రూ.8 వేల పెట్టుబడి’ పై సోమవారం లఘు చర్చకు సిఎం సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త చరిత్ర సృ ష్టించబోతున్నామని, రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. నిరంతరాయంగా వెలుగులు ప్రసరిస్తాయని, స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్ర ముఖచిత్రం మారబోతుందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించగలుగుతామన్నారు. భూగర్భజలాలు తగ్గిపోయే ప్రమాదముందని, రైతులంద రూ ఆటో స్టార్టర్లు తీసేయాలని సిఎం విజ్ఞప్తి చేశా రు. ఆటోస్టార్టర్ల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజా ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డిసెంబర్‌లో ఆటోస్టార్టర్ల తొలగింపు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు ఆయ న తెలిపారు. వేసవిలో కూడా విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
56 లక్షల టిఆర్‌ఎస్ కార్యకర్తల్లో రైతులు ఉండరా?
రైతు సమన్వయ సమితుల్లో టిఆర్‌ఎస్ కార్యకర్తలనే వేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలను సిఎం ప్రస్తావించారు. “ ఏ అధికారం లేకపోయినా, ఏమి లేకపోయినా అటుకులు బుక్కో, అన్నం తినో, ఉపా సం ఉండో, నీళ్లు తాగో ఈ బక్క పేద టిఆర్‌ఎస్ కార్యకర్తలే 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు. మీరందరు పదవులల్ల సేద తీరిననాడు, మీరు అదే టిఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయించి జైల్లో వేసిన్నాడు, మీరు కేసులు పెట్టిన్నాడు పేగులు తెగేదాక కొట్టాడినారు తెలంగాణ తేవడానికి. ఇయ్యాల తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా గా కార్యకర్తలే పని చేస్తరు. వాళ్ళే రైతు సమన్వయ సమితిలో ఉంటర’ని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు గండికొట్టే వారిని సభ్యులుగా నియమించబోమని, చిత్తశుద్ధి ఉన్నవారినే ్ల నియమిస్తామన్నారు.
సమితి మద్దతు ధర ఇప్పిస్తుంది
రైతు సమన్వయ సమితిలు విత్తనాలు వేసినప్పటి నుంచి పండిన పంటకు రైతుకు గిట్టుబాటు ధర దక్కేంత వరకు కేవలం సమన్వయ పాత్ర పోషిస్తాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర దక్కకపోతే మండల సమన్వయ సమితి జోక్యం చేసుకుని మద్దతు ధర వచ్చేలా చూస్తుందన్నారు. స్థానికంగా మద్దతు ధర రాకపోతే రాష్ట్ర సమన్వయ సమితి ద్వారా మద్దతు ధర ఇప్పిస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల శాఖ మాదిరిగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనిపై న్యాయసలహా తీసుకుంటున్నామన్నారు. భూరికార్డుల ప్రక్షాళన 46 శాతం పూర్తయిందన్నారు.
నాడు కాంగ్రెస్ ఏమి చేసింది?
రైతు సమన్వయ సమితిల ఏర్పాటును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, టిడిపి పార్టీలు వారి పాలనలో ఏమి చేశాయో గుర్తు చేసుకోవాలని సిఎం కెసిఆర్ అన్నారు. టిడిపి హయంలో 2 లక్షల రైతు మిత్ర బృందాలను ఏర్పాటు చేసి, వాటికి రూ.350 కోట్లను కేటాయించారన్నారు. కాంగ్రెస్ హయంలో దివగంత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అనర్హులను ఆదర్శరైతులను చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయంలోనే స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆయన విమర్శించారు.
కౌలు రైతుతో సర్కార్‌కు సంబంధం లేదు
కౌలుదారు నెపంతో అసలు రైతు మునగడం తమకిష్టం లేదని, కౌలుదారు కన్నా తమకు రైతే తమకు తొలి ప్రాధాన్యత అని సిఎం కెసిఆర్ అన్నారు. కౌలుదారు శాశ్వతం కాదని, మారుతుంటారని, రైతు శాశ్వతం అని అన్నారు. కౌలుదారీ చట్టం ప్రమాదకరమైనదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తామిచ్చే పెట్టుబడి రైతుకే ఇస్తామన్నారు. ప్రభుత్వం రెండు దఫాలు రూ.4000 చొప్పున రూ.8000 ఇస్తుందని ప్రకటించాక, కౌలుకిచ్చిన రైతులు పెట్టుబడి ప్రభుత్వం ఇస్తున్నందున తామే వ్యవసాయం చేసుకోవడం మంచిదనే ఆలోచనకు వస్తున్నారని ఆయన అన్నారు.

 

Comments

comments