Search
Sunday 25 February 2018
  • :
  • :

ఆదాయాన్నిచ్చే ఫేస్‌బుక్ ఫీచర్

Marketplace-Feature-in-Face

దిగ్గజ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారత్‌లోని తన వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ‘మార్కెట్ ప్లేస్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ మనకు ఆదాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ బయటి దేశాల్లో వాడకంలో ఉండగా త్వరలోనే ఇండియాలోని ఎఫ్‌బి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. మార్కెట్ ప్లేస్ ఫీచర్ ఆన్‌లైన్ మార్కెటింగ్ యాప్స్ ఒఎల్‌ఎక్స్, క్వికర్‌లానే పనిచేస్తుంది. వీటిలో ఎలాగైతే మనం అమ్మాదలచిన లేక కొనదలచిన వస్తువులు కేటగిరిలుగా ఉంటాయో, మార్కెట్ ప్లేస్‌లో కూడా అలాగే పెట్టవచ్చు. వాటిని సందర్శించే మరో వినియోగదారుడు అవసరం అనుకుంటే కొనవచ్చు. ఇక ఫేస్‌బుక్‌లో యూజర్లు ఎప్పడూ అందుబాటులోనే ఉంటారు కనుక చాటింగ్ ద్వారా తమ వస్తువులను గిట్టుబాటు ధరకు అమ్మడమో, కొనుగోలు చేయడమో చేసే అవకాశం ఉంటుంది. అతి త్వరలోనే భారత ఫేస్‌బుక్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Comments

comments