Search
Thursday 22 February 2018
  • :
  • :

కాంగ్రెస్‌తోనే రైతు రాజ్యం

cong

మన  తెలంగాణ/భూపాల పల్లి ప్రతినిధి : తెలంగాణ రా ష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కారానికై రైతు రాజ్య స్థాపన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని టిపిసిసి హైపవర్ కమిటీ చైర్మన్, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని 2019 ఎన్నికలలో అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు మార్పుకోరుకుంటున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌తో రుణమాఫీ అందించిన పంటలకు మద్దతు ధర అందించిన ఘనత దక్కిందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వ పాలకులు పూర్తిగా విస్మరించారని, సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని రాష్ట్రంలో కెసిఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ రైతులకు చేసింది శూన్యమన్నారు. రైతుల పేరుతో ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అన్నదాతలకు అందిన పాపానపోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి 2లక్షల వరకు రుణమాఫీ, పెట్టుబడికి సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తామని స్పష్టం చేశారు. రైతులు అదైర్యపడవద్దని అండగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమున్నామని అవసరమైతే రైతు భరోసా యాత్రతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడకుండా అన్నదాతల కోసం ప్రాణాలు పణంగా పెట్టయినా పాలకుల మెడలు వంచి రైతుల సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల టిడిపి,టిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో రేగొండ మండల పార్టీ అధ్యక్షులు ఇంగే మహేందర్, ఆయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Comments

comments