Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కలెక్టరే కక్షకడితే ఏలా!

former-images

కలెక్టరేట్‌లో ఎవరికి ఆటంకం కలిగించలేదు
నష్టపరిహారం కోసం వచ్చాం. నేడు పోలీస్‌స్టేషన్‌కు హాజరుకానున్న హెచ్‌టి బాధిత రైతులు

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: జిల్లాలో హైటెన్షన్ లైన్ల బాధిత రైతులపై కలెక్టర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం సంచలనంగా మారింది. న్యాయ పరంగా నష్టపరిహారం చెల్లించే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేయడానికి వెళ్లిన బాధిత రైతులకు సరైన న్యాయం జరుగలేదని జిల్లా హెచ్‌టి లైన్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు విషయమై శుక్రవారం బాధిత రైతులు మెదక్ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కానున్నారు. గత నెల 30వ తేదీన కలెక్టరేట్‌లో జరిగిన ధర్నాలో భాగంగా వీరిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారని రైతులు చెబుతున్నారు. తాము కలెక్టరేట్‌లో ఎవరికి ఎటువంటి ఆటంకం కలుగజేయలేదని, శాంతియుతంగా తమకు రావాల్సిన నష్టపరిహారం విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడానికి కలెక్టరేటుకు వచ్చామన్నారు.

అందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయంలో లేనం దునా దాదాపు గంటన్నర పాటు బయటనే ఉండిపోయామన్నారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగానే తమ గోడు వింటుందని ఎంతో ఆశతో ఉన్నాగానీ కనీసం రైతులు ఎందుకోసం వచ్చారనే విషయం తెలుసుకోకుండా కలెక్టర్ నిర్లక్షంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైటెన్షన్ వైర్ల విస్తరణలో కాంట్రాక్టర్లు తమకు సరైన నష్టపరిహారం చెల్లించలేదని తెలుపడానికి వచ్చామనే సందేశం పంపి, అందుకోసం వినతిపత్రాన్ని అందజేయడానికి వచ్చామని తెలియజేశారు.

అయినప్పటికీ కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని అం దుకోకపోవడంతో కలెక్టర్ బయటకు వచ్చి తమ వినతిపత్రాన్ని తీసుకోవాలని నినాదాలు చేశామన్నారు. కలెక్టర్ కేవలం 10 మందికి మాత్రమే లోనికి రావడానికి అనుమతిచ్చిందని, మిగితా 200 మంది రైతులను బయటే నిల్చోబెట్టడంతో తమ సమస్య కలెక్టర్‌కు వివరించడం ఎలా అనీ ప్రశ్నించారు. పాలనాధికారిగా రైతు సమస్యలను అడిగి తెలుసుకోవడం తన విధికాదా అని అంటున్నారు. కలెక్టర్‌కు రైతుల పట్ల ఉన్న భావం ఇంతేనా అని బాధపడుతున్నారు. ఈ విషయమై మనస్థాపం చెందిన ఒక యువరైతు కలెక్టరేటు ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య యాత్నానికి పాల్పడగా తోటి రైతులు వెంటనే అతన్ని కిందికి దింపగా అపస్మారక స్థితికి చేరుకున్న సంఘటన చోటుచేసుకుంది. దీంతో కలెక్టరేటులో తమకు న్యాయం జరుగదనే ఆవేశంలో రైతులు తమ వినతిపత్రాన్ని చించి అక్కడే కాల్చీవేసి వెను దిరిగిపోయామని, ఇది అక్టోబర్ 30వ తేది సోమవారం జరిగిన సంఘటన అని వారు తెలిపారు.

ఈ విషయమై కలెక్టర్ తమపై ఆగ్రహంతో ప్రతీ కార చర్యగా పోలీసు కేసులు బనాయించీ తమను భయ బ్రాంతులకు గురిచేస్తుందని తెలిపారు. న్యాయం చేయాల్సిన కలెక్టరే అన్యాయంగా కేసులు పెడితే తమకు దిక్కెవరని బాధి త రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హైటె న్షన్ లైన్ల బాధిత రైతులందరు ప్రభుత్వం సూచించిన నష్ట పరిహారాన్ని మాత్రమే చెల్లించవల్సిందిగా తాము కోరుతున్నా మన్నారు.

Comments

comments