Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

యాసంగికి సిద్ధమవుతున్న రైతాంగం

COW

*యంత్రాల లేమితో ఆలస్యమవుతున్న వరి కోతలు – మబ్బులను చూసి ఆందోళన చెందుతున్న రైతన్నలు

మనతెలంగాణా/తుంగతుర్తి: ఒక పక్క ఖరీఫ్ వరికోతలు ముమ్మరంగా సాగుతుండగా మరో పక్క యాసంగి వరి నార్లు పోయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కొంత మంది రైతులు అక్టోబర్ చివరి వారం నుం డి యాసంగి నారు మడులను సిద్దం చేశారు. ఇప్పటికే కొంత మంది నార్లు కూడా పోయడం జరి గింది. సన్న రకాలకు ఖరీఫ్‌లో అధిక దోమ పోటు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగం ప్రస్థుత తరుణంలో దొడ్డు రకాలైన 10010 రకం వరి విత్త నాలనే అధిక కొనుగోలు చేస్తున్నట్లు చేస్తుంది. ఖరీఫ్ వరిచేలు కోతలు పూర్తి అయ్యే సరికి కోసిన నార్లు నెల రోజులు అవుతాయని కోసిన వెంటనే దుక్కులు దున్ని వరి నార్లకు సిద్ధం చేసుకోవచ్చు అని రైతుల అభిప్రాయ పడుతున్నారు. కాగా వరి కోతలకు చాలినన్ని వరికోత యంత్రాలు రాక ఆకాశంలో వస్తున్న మబ్బులను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీరా నోటి ముందరికి వచ్చిన వరి చేను కోతలకు పూర్తి అయ్యే దాక అకాల వర్షం రా కుండా ఉండాలనేది రైతుల కోరిక. కాగా గత రెండు రోజులుగా తీవ్ర మైన మబ్బులు కమ్మి ఆకాశం వర్షం కురుస్తుందా అన్న చం దంగా కనిపించడంతో రైతులు ఆందోళన అధికమైంది. ఇప్పటికే వరి కోత యంత్రాల వారు గత సంవత్సరం రూ. 1500లకు గంట వరి కోయగా నేడు రూ. 1800 రూపాయలకు పెంచారు. అయిన యంత్రాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వరి కోత పూర్తి అవ్వాలి మరో పక్క యాసంగి పొలాలు సిద్ధం అవ్వాలని ఆత్రుత రైతుల్లో కనిపిస్తుంది. మరో పది రోజుల్లొ దాదాపు ముందుగా పెట్టిన వరి నాట్లన్ని కోతలు పూర్తి కావొచ్చని రైతులు అంటున్నారు. యాసంగి వరి పంటకు నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే ముందుగా నాట్లు కావాలని లేనట్లైతే ఏప్రిల్ , మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి వరి చేను ఎండి పోయే ప్రమాదం ఉందని అంతేకాక వడగం డ్లు వచ్చే అవకాశం ఉందని రైతులు ముందుగానే యాసంగికి సిద్ధం అవుతున్నారు.

Comments

comments