Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

వేగవంతంగా రెవెన్యూ భూ ప్రక్షాళన

amrapaliఅధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ 

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: ఇంటింటి జరిగే రెవె న్యూ భూ ప్రక్షాళనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. గురువారం సా యంత్రం సిఎస్ ప్రభుత్వకార్యదర్శి స్మితాసభర్వాల్ రాష్ట్ర భూ ప్రక్షాళన మిషన్ డైరెక్టర్ కరుణలతో కలిసి సిఎస్ హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా కలెక్టర్లతో అటవీ, రెవెన్యూ, నీటి పారుదల, దేవాదాయ భూములపై వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రెవెన్యూ సర్వే ప్రక్షాళనలో అధికారులు గుర్తించిన భూములలో వివాదస్పద, అటవీ భూములు, ప్రత్యేకంగా నమోదు చేయాలని అలాగే అటవీ భూములు అసైన్డ్ చేయబడి రైతు ల ఆధీనంలో ఉండి ఆ భూముల్లో పోడు చేసినట్లయితే వాటి ని ఎలాంటి ఆర్‌ఒఎఫ్‌ఆర్ భూములకు వ్యవసాయ హక్కులే ఉంటాయని ఆయన తెలిపారు. దేవాదాయ, నీటిపారుదల ఇతర ప్రభుత్వ భూముల రెవెన్యూ సర్వే ఏ మేరకు ప్రక్షాళన జరుగుతుందని కలెక్టర్లను ఆరా తీశారు. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ అటవీ భూములు గల గ్రామాలు 25 ఉన్నాయని ఇందులో 35241.64 ఎకరాల రిజర్వు ఫారెస్ట్ భూములు గుర్తించడం జరిగిందన్నారు. దీనికి గాను 5 గ్రామాల (పిఒబి) ప్రొహిబిటరి అడర్ బుక్‌లను తహసీల్దార్లకు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ భూ ప్రక్షాళన 230 గ్రామాల్లో 77 శాతం పూర్తి చేశామని మిగతా సర్వే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.హరిత, జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం, వరంగల్ రూరల్ ఆర్‌డిఒ మహేందర్‌జీ, నర్సంపేట ఆర్‌డిఒ రవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Comments

comments