Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కొడుకును చంపిన కసాయి తండ్రి

MURDER

విశాఖపట్నం : మూడేళ్ల వయస్సు ఉన్న కొడుకును ఓ కన్న తండ్రి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన అనకాపల్లి మండలం మారేడుపూడి కాలనీలో మంగళవారం జరిగింది. ఈగల బాబూరావు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు రావడంతో బాబూరావు భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి బాబూరావు తన తల్లి అప్పలనర్సమ్మతో కలిసి భార్య వద్దకు వెళ్లాడు. కొడుకు దినేష్‌ను తీసుకొని మారేడుగూడ వచ్చాడు. మంగళవారం ఉదయం మద్యం మత్తులో దినేష్‌ను గునపంతో పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father killed his Son

Comments

comments