Search
Wednesday 22 November 2017
  • :
  • :

‘మనం’ సెట్ కాలిపోవడం బాధగా ఉంది:నాగార్జున

nag

హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం సాయంత్రం షాట్ సర్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందని అక్కినేని నాగార్జున అవేదన వ్యక్తం చేశారు.తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు చివరగా నటించిన సినిమా కావడంతో ఈ సెట్‌ను చూసినప్పుడుల్లా ఆయన గుర్తొచ్చేవారని నాగార్జున అన్నారు. మనుషులే పోయినప్పడు.. సెట్ కాలిపోతేముందిలే, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎద్డగా ఎగిపిపడుతున్న మంటలను ఎలా ఆర్పుతారనుకున్నా, కానీ ఫైర్ సిబ్బంది కేవలం 15 నిమిషాల్లోనే మంటలను అదుపుచేశారు. ఈ సందర్భంగా ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు, పోలీసులకు నాగార్జున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల విడుదలైన ‘రాజు గారి గది2’ సినిమాకు కూడా ఈ సెట్‌లోనే షూటింగ్ జరిగిందని తెలిపారు.

Comments

comments