Search
Monday 11 December 2017
  • :
  • :

పెళ్లి బస్సులో మంటలు

                        Bus-Accident

హైదరాబాద్:  హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళ్తున్న పెళ్లి బస్సులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన భువనగిరి పట్టణంలో సంభవించింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి బృందం జగదేవ్ పూర్ చేరుకోగానే వెనక టైరులో నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ పెళ్లి బృందాన్ని కిందకి దింపి పొగలు వస్తున్న ప్రాంతంలో నీళ్లు చల్లాడు. బస్సుకు మరమ్మతులు చేసిన అనంతరం పెళ్లి మండపానికి వెళ్లిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.

Comments

comments