Search
Thursday 22 March 2018
  • :
  • :
Latest News

స్టూడియోలో అగ్నిప్రమాదం

nag2

అన్నపూర్ణలో గంటన్నరపాటు ఎగసిపడిన జ్వాలలు, 6 ఫైరింజన్లతో ఆర్పివేత
దగ్ధమైన ‘మనం’, ‘రాజుగారిగది’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల సెట్టింగ్‌లు

హైదరాబాద్ సిటీబ్యూరో: అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడగా, సినిమా సెట్టింగులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన మంటలు గంటన్నర పాటు ఎగిసిపడడంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఫైరింజన్లు సైతం ఘటనా స్థలానికి చేరుకోడానికి నానా అవస్థలు పడ్డా యి. చివరకు ఆరు ఫైరింజన్లు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. మనం, రాజు గారి గది, రారండోయ్ వేడుక చూద్దాం, మరో చిత్రానికి వేసిన సెట్టింగ్స్ దగ్ధమయ్యాయి. గాయ పడిన ఇద్దరు కార్మికులను హుటాహుటీనా ఆసుపత్రికి తరలించారు.వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. షాట్‌సర్కూట్ వల్లనే లేదా మరే ఇతర కారనాల వల్ల జరిగిందా అనేది ఫైర్ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ట్రాపిక్ జామ్‌తో ఫైరింజన్లు ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నా యి. దగ్దమైన సెట్టింగ్‌లు అన్ని కూడా చెక్క లు, కర్రలు, కార్డ్‌బోర్డుతో చేసి ఉండడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ఘటనా స్థలానికి మీడియాను వెల్లకుండా నటుడు నాగార్జున అడ్డుకున్నారు. ఇది తమ ప్రైవేటు ప్రాపర్టి అని మీడియాను అనుమతించమని చెప్పా రు. దీంతో మీడియా ప్రతినిధులకు నాగార్జున మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
చాలా అదృష్టం : నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఘటనా స్థలంలో మీడియాతో మాట్లాడుతూ మంటలు త్వరగా అదుపులోకి రావ డం అదృష్టమన్నారు. సినిమా షూటింగ్ కోసం ఐదేళ్ల క్రితం వేసిన సెట్టింగ్‌లోనే ఈ ప్రమాదం జరిగిందని, మిగతా ప్రాంతాలకు మంటలు వ్యాపించలేదని స్పష్టం చేశారు.

రవీంద్ర భారతిలోనూ మంటలు  

 రవీంద్రభారతి ప్రధాన కళామందిరంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం  సంభవించింది. ఈ ప్రమాదంపై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10గంటల సమయంలో రోజుమాదిరి పర్యవేక్షణలో భాగంగా తనిఖీలు చేస్తుండగా ఆడిటోరియం ప్రధాన తెర వేదిక పక్కవుండే హాలోజిన్‌లైట్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, అక్కడనే ఉన్న సెక్యూరిటీ గార్డు శంకర్ వెంటనే విద్యుత్ సరఫరాను సమాయోచితంగా నిలిపివేయడంతో పెద్ద ప్రమా దం తప్పిందన్నారు. మంటలంటుకున్న తెరను సిబ్బంది లాగివేసి, నీళ్లతో చల్లడంతో మంటలు ఎగబాకే అవకాశం తప్పిందన్నారు. అప్పటికే ముందు జాగ్రత్త  చర్యగా అగ్నిమాపక దళాలకు సమాచారం ఇవ్వడం జరిగిందని వారు వచ్చే లోపే మంటలను ఆర్పివేయగలిగామని ఆయన వివరించారు. ప్రధానతెర, దాని వెనుక ఉన్న తెర, రెండు పక్కల ఉన్న స్పీకర్లు కాలిపోయాయని, మిగతా ఆడియో సిస్టమ్స్, నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక స్పీనర్లకు, లైటింగ్ సిస్టమ్స్‌కు ఎలాంటి హాని కలుగలేదని, ఆస్తినష్టం మాత్రం 2లక్షల లోపే ఉంటుందని  ఆయన పేర్కొన్నారు.

Comments

comments