Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం…

Lorry-Collision-Auto

మహబూబ్‌నగర్: జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో-లారీ ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులను జడ్చర్ల మండలం బండమీదిపల్లి చెందిన బాలమ్మ, లక్ష్మమ్మ, యాదమ్మ, రఫీయుద్దీన్(ఆటో డ్రైవర్)గా గుర్తించారు. గంగాపురంలో పత్తి తీసే కూలీకి వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘట జరిగింది.

Five killed in worst Road Accident in Mahbubnagar.

Comments

comments