Search
Monday 11 December 2017
  • :
  • :

‘ఫ్లిప్‌కార్ట్’ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది…

Billion-Capture+ముంబయి: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. బిలియన్ బ్రాండ్‌పై ‘క్యాప్చర్ ప్లస్’ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మొబైల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 15న ఇండియన్ మార్కెట్లోకి ‘బిలియన్ క్యాప్చర్ ప్లస్’ విడుదల కానుంది. రెండు వెరియంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రూ. 10,999 ధర గల మొబైల్ 3జిబి రామ్, 32జిబి స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే రూ. 12,999 ధర గల మొబైల్ 4జిబి రామ్, 64జిబి స్టోరేజ్‌తో లభించనుంది.

Flipkart-Billion-Capture+‘బిలియన్ క్యాప్చర్ ప్లస్’ ఫీచర్స్ ఇలా ఉన్నాయి…
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్ వెర్షన్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (1080×1920 పిక్సెల్స్) ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఒసి, స్టోరేజ్ కెపాసిటీని 128జిబి వరకు విస్తరించుకునే సదుపాయం ఉంది. అలాగే పవర్‌ఫుల్ 3500 ఎంఎహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో అమర్చారు. అంతేగాక ఫాస్ట్ చార్జింగ్…15 నిమిషాల్లో 7 గంటలకు సరిపడా చార్జింగ్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక డ్యుయల్ రియర్ కెమెరా ఈ ఫోన్‌లో ఉన్న మరో ప్రత్యేకత. ఈ రెండు కెమెరాలు 13 మెగాపిక్సెల్స్‌తోపాటు డ్యుయల్ ఫ్లాష్ మోడ్‌తో పని చేస్తాయి. ఇప్పటి వరకు ఈ-రిటేల్‌తో వినియోగదారులకు ఎంతగానో చేరువైన ఫ్లిప్‌కార్ట్ మొబైల్ రంగంలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Comments

comments