Search
Wednesday 22 November 2017
  • :
  • :

పారిశుద్ధ పనులకు …మున్సిపాలిటీలకు ర్యాంకింగ్

clctr

* మున్సిపాలిటీ పరిధికి 3 నుండి 5కి.మీ దగ్గరలో ఉన్న పంచాయతీల ప్రతిపాదనల పరిశీలన
* జిల్లాలో 15వేల జనాభా దాటిన గ్రామపంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చుటకు ప్రతిపాదనలు పంపాలి
*వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లు
సూర్యాపేట : రాష్ట్రంలో జిల్లాలలో మున్సిపాలిటీలకు దాదాపు 3 నుండి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గ్రామపం చాయ తీలను పట్టణంలో కలపడానికి, అలాగే జిల్లాలో 15వేల జనాభా వున్న గ్రామ పంచా యతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేయుటకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఐటి, పరిశ్ర మలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌లు, మున్సి పల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భం గా మంత్రి మాట్లాడుతూ దేశంలో 4041 పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛ భారత్‌లో భాగంగా పారి శుద్ధ్ద కార్యక్రమాలు చురుకుగా సాగుతు న్నాయని అలాగే రాష్ట్రం లోని 72 మున్సిపాలి టీలలో పారిశుద్ధ పనులు శరవేగంగా నిర్వహించడం జరుగుతుం దని తెలిపారు. 2016 నిబంధనల ప్రకారం పారిశుద్ధ పనులకు మున్సి పాలిటీల వారిగా ర్యాంకింగ్ ఇస్తామని మంత్రి ఈ సంద ర్భం గా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహన్ మంత్రికి వివరిస్తూ జిల్లాలోని పారిశుద్ధ్య పనులతో పాటు కోదాడ, హుజూర్‌నగర్ మున్సి పాలిటీలలో కూడ పారిశుద్ధ పనులు ఎప్పటికప్పుడు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, మున్సి పల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, సూర్యాపేట, కోదాడ మున్సిపల్ కమిషనర్లు జికె దుర్గాప్ర సాద్, కె.అమరేంద్రరెడ్డి, కె.నర్సింహా తదితర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments