Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అడవి ఆగం

TREE

రోజు రోజుకు తగ్గిపోతున్న విస్తీర్ణం  ఆగని వనమేధం  అడవుల జిల్లాలో గొడ్డళ్ల సవ్వడి  ఒక వైపు హరితహారం మరో వైపు సంహారం 

అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో 6944 స్కేర్ కి.మీ పరిధిలో 43% అడవులతో పచ్చదనం పరుచుకొని ఉన్న జిల్లా ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట వేస్తున్న రోడ్లు, స్మగ్లర్ల చెట్ల నరికివేతలతో 34%నికి కుంచించుకు పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది సంవత్సరాలలోనే అడవి బీడుగా మారే పరిస్థితులు నెలకొనక తప్పదని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల పరిస్థితిపై ప్రత్యేక కథనం

 అడవుల ఖిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు వనసంపద తరిగిపోతోంది. అటవీశాఖ మంత్రిగా జిల్లాకు చెందిన నే త ఉన్నప్పటికీ ఆ శాఖ పనితీరు ఆశాజనకంగా కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ మంత్రి ఇప్పటికే పలుసార్లు అడవుల సంరక్షణతో పాటు చెట్ల పెంపకంపై సమీక్షా సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. అయినప్పటికీ ఆ శాఖ పనితీరులో పెద్దగా మా ర్పు కనిపించడం లేదని అంటున్నారు. ఓ వైపు స్మగ్లర్లు అడవులను నరికివేస్తూ అడువుల విస్తీర్ణాన్ని తగ్గించేస్తుండగా, నరికివేసిన దుంగలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీ రెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, ని ర్మల్, జన్నారం, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు విలువైన కలపను అక్రమంగా తరిలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలలో కలప పట్టుబడుతున్నప్పటికీ అక్రమంగా తరులుతున్న కలపలో ఇది కొంత శాతమేనని అంటున్నారు. గత కొన్నేళ్ల క్రితం అడవుల దట్టంగా ఉండగా, ప్రస్తుతం అటవీ ప్రాంతమంతా మైదానంగా మారి కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చెట్ల నరికివేతతో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించడం లో అధికారుల వైఫల్యంతో పాటు కలపకు ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్నకు బదులు లేకుండా పోతుంది. విలువైన కలపకు పట్టణాల్లో, నగరాలలో భారీగా డిమాండ్ ఉండడంతో చెట్ల నరికివేత స్మగ్లర్లకు కాసులు కురిపిస్తుంది.
మరోవైపు పోడు వ్యవసాయం పేరిట అడవుల నరికివేత కొనసాగుతోంది. ఇలా వన సంపదపై దాడులు కొనసాగుతుండడంతో విశాలమైన విస్తీర్ణం క్రమంగా కనుమరుగవుతోంది. రానురాను అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా అడవుల విస్తీర్ణం పెరగాల్సింది పోయి మ రింతగా కుదించుకుపోతుంది. అటవీ అధికారుల నిర్వాకం కారణంగా నే వన సంపద తరిగి పోతుందన్న ఆరోపణలున్నాయి. ఇదిలాఉండగా ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం జిల్లాకు ఆ శించిన ప్రయోజనం చేకూర్చలేదన్న అభిప్రాయాలున్నాయి. పెద్ద ఎత్తు న చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదని అంటున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హడావుడి గా నాటిన మొక్కలను సంరక్షించే విషయంలో ప్రజలు, అధికారులు దృ ష్టి సారించడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటీవల జిల్లాల విభజన తరువాత కూడా అటవీ శాఖ కార్యాచరణ ఆశాజనకంగా లేకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఏడాది, రెండేళ్లలోగా అడవుల శాతం మరింతగా తరిగిపోయే ప్ర మాదం లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ మొక్కల పెంపకంపై సీరియస్‌గా దృష్టి సారించి చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు.

Comments

comments