Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

వరుసగా నాలుగోసారి నష్టాలు

reliance

* క్యూ2లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నష్టం రూ.2,709 కోట్లు

ముంబయి: అప్పుల భారంతో సతమతమ వుతున్న టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూ నికేషన్స్(ఆర్‌కామ్) రెండో త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నష్టం రూ.2,709 కోట్లు నమోదు చేసింది. కంపెనీ ఎంతగా అప్పుల భారం తగ్గించుకోవాలని చూస్తున్నా క్యూ2(జులైసెప్టెంబర్) నష్టాలే వచ్చాయి. దీంతో కంపెనీ వరుసగా నాలుగు నెలలు త్రైమా సికాలు నష్టాలను నమోదు చేసినట్టయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.62 కోట్లుగా ఉంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ మొత్తం ఆదాయం రూ.2,667 కోట్లతో 48 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5,142 కోట్లుగా ఉంది. ఫైనాన్స్ కాస్ట్ రూ.825 కోట్ల నుంచి రూ.1,149 కోట్లకు పెరిగింది. శుక్రవారంనాడు ఆర్‌కామ్ షేరు 6.33 శాతం పడిపోయి రూ.14.05 వద్ద స్థిరపడింది. కాగా బ్యాంకులకు ఆర్‌కామ్ రూ. 45,000 కోట్లు బకాయి పడిన విషయం తెలిసిందే. రుణ భారానికి సంబంధించి కొత్త రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను బ్యాంకులకు ఆర్‌కామ్ సమర్పించింది. దీన్ని ఆమోదించినైట్లెతే ఆర్‌కామ్‌లో బ్యాంకులకు కనీసం 51 శాతం వాటా దక్కనుంది. ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీ, ఇతర ప్రమోటర్ల వాటా దాదాపు 26 శాతానికి పడిపోనుంది. బ్యాంకుల రుణాలను తీర్చడానికి ఆర్‌కామ్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమాత్రం ఫలించలేదు. ఎయిర్‌సెల్‌తో విలీన ప్రక్రియ కూడా బెడిసికొట్టింది. దీంతో చివరకు 2జి, 3జి సేవలకు గుడ్‌బై చెప్పింది. ఆర్‌కామ్ కొత్త రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికతో బ్యాంకర్ల ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.17,000 కోట్ల బకాయిలను తీర్చేందుకు ఆస్తుల అమ్మకానికి పెట్టనుంది. రియల్ ఎస్టేట్ ఆస్తుల అమ్మకంతో రూ.10,000 కోట్ల నిధులు.. టవర్ల వ్యాపారం లోని ఆస్తుల విక్రయం ద్వారా మరో రూ.7,000 కోట్లు వచ్చే వీలుందని కంపెనీ భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ నిధులు సమకూరగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందాన్ని ఆర్‌కామ్ చేసుకో గా, దాని గడువు ఈ డిసెంబర్ ఆఖరుదాకా ఉం ది. నష్టాల నుంచి, అప్పు భారం నుంచి బయట పడేందుకు అనిల్ అంబానీ కంపెనీ ఆర్‌కామ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

Comments

comments