Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఎఫ్ఎస్ టిపి ఫ్లాంట్ అమోఘం

AMRAPALI

ప్రశంసించిన మిలిండా బిల్‌గేట్స్ బృందం
కలెక్టరేట్‌లో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
పబ్లిక్ టాయిలెట్స్ పరిశీలన

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని జరుగుతున్న వివిధ రకాలైన అభివృద్ధి పనులను మిలిండా బిల్ గేట్స్ ప్రతినిధి బృం ధం సందర్శించింది. శుక్రవారం వరంగల్ నగర కార్పొరేషన్‌లో అవలంబిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీరుతెన్నులు పరిశీలించారు. వడ్డేపల్లి క్రాస్‌రోడ్‌లోని పబ్లిక్ టాయిలెట్స్‌ను, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోని టాయిలెట్స్‌ను సందర్శించి పరిశీలించారు. అదేవిధంగా అంబేద్కర్‌నగర్‌లోని డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న స్ల మ్ ఏరియాలలో పర్యటించి అక్కడి డ్రైనేజీ స్థితిగతులను పరిశీలించారు. అనంతరం డ్రైనేజీ వాటర్ శుద్ధీకరణ ప్లాంట్‌ను నిర్మించి, ఆ నీటిని ఆ ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటే ఏ విధంగా ఉంటుందో మిలిండా ప్రతినిధులు ఆస్కీ ప్రతినిధుల ను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే వినూత్నంగా తలపెట్టిన ఫిస్కల్ స్లాడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టిపి)ను సందర్శించిన ప్రతినిధి బృందం ఈ ఆలోచన విధానం బాగా ఉం దని ప్రశంసించారు. మల శుద్ధి ప్రక్రియ ఎలా
ఎలా నిర్వహిస్తారో ఎఫ్‌ఎస్‌టిపి ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు. తరువాత సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లను కలిసిన ప్రతినిథి బృందం సెప్టిక్ ట్యాంక్‌ను ఏవిధంగా శుభ్రపరుస్తారో, మలాన్ని ఏ విధంగా సేకరిస్తారో తదితర అంశాలను ప్రతినిధి బృందం అడిగి తెలుసుకుంది.
కలెక్టర్, కమిషనర్‌తో ప్రత్యేక సమావేశం
నగరంలోని పలు ప్రాంతాలను పర్యటించిన మిలిండా ప్రతినిథి బృందం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వరంగల్ అర్బన్‌జిల్లా కలెక్టర్ అమ్రపాలి, నగర మున్సిపల్ కమిషనర్ శృతిఓజాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా ఐదు అం శాలపై ప్రత్యేకంగా దృష్టిసారించామని తెలిపా రు. మొదట ఇంజనీరింగ్ విభాగమని, ఇందు లో ప్రధానంగా డ్రైనేజీ నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం, 60అడుగుల రోడ్ల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణం, వాటర్ సప్లయ్‌తోపాటు వాటర్ లీకేజీవంటివి పర్యవేక్షిస్తారని, రెండవ విభాగం హెల్త్ అండ్ శానిటేషన్ విభాగమని, ఇందులో నూరుశాతం చెత్తసేకరణపై దృష్టి సారించామన్నారు. మూడో విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం ఇందులో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టన వారికి జరిమానాలను విధించడం, సిటీ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన వంటి అంశాలు ఉంటాయ ని కమిషనర్ వివరించారు. నాల్గవ విభాగం పన్నుల విభాగం అని దీని ద్వారా ప్రాపర్టీ కలెక్షన్‌తోపాటు వ్యాపారాల నిర్వహణలో ట్రేడ్‌లైసెన్స్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐదో విభాగం హార్టీకల్చర్ విభాగం ఇందులో పార్కుల నిర్మాణం, ఆధునీకరణ, నగర సుందరీకరణ వంటి అంశాలపై రోజువారికి ప్రతి అం శంపైన సమగ్రంగా సమీక్షించడం జరుగుతుందని కమిషనర్ వివరించారు.
స్వచ్ఛ భారత్ పథకం అమలవుతోంది… అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి
ఇతర దేశాలలో లాగే ఇక్కడ రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. దేశంలో శానిటేషన్ మెరుగు కోసం స్వచ్ఛభారత్ పథకం తీసుకరావడం జరిగిందని, దీని ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో విజయవంతంగా అమలుచేయడం జరుగుతుందని కలెక్టర్ అమ్రపాలి వివరించారు. ఆస్కీ ప్రతినిధులు శ్రీనివాసాచారి, మాలిని, రాజ్‌మోహన్, అపర్ణ, స్పందన, బిలిం డా బిల్‌గేట్స్ ప్రతినిధులు నార్త్‌వెస్ట్ ప్రొవినియల్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (దక్షణాఫ్రికా) విలియం మారక, ఉమ్‌లత్ ఉజ్, లోకల్ మున్సిపాలిటీ డై రెక్టర్ తోబెక-దేబోర ద్లమిని, జయంత్ నర్సీభగవాన్, ఎగ్జిక్యూటీవ్ మేనేజర్ వాటర్ యూజ్ అం డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశా యూతయన్, డైరెక్టర్ వెస్ట్ వాటర్ కన్వెయన్స్, స్టార్ మొలబెల, డైరెక్టర్ వాటర్ సర్వీసెస్ లేసిడిఎల్‌ఎం, మార్క్ వేస్టేర్బర్గ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments