Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

తొలి ట్రాన్స్‌జెండర్ కానిస్టేబుల్

Ganga-Kumari

జైపూర్: రాజస్థాన్‌లో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కానిస్టేబుల్‌గా నియామకమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు గంగాకుమారిని కానిస్టేబుల్‌గా నియమిస్తూ రాజస్థాన్ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాజస్థాన్ పోలీస్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ కానిస్టేబుల్‌గా గంగాకుమారి రికార్డు సృష్టించారు. 2013లో జరిగిన రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్‌లో జాలోర్ జిల్లా, రానివరకు చెందిన గంగాకుమారి ఈవెంట్స్‌తోపాటు ఎగ్జామ్స్‌లో కూడా క్వాలిఫై అయ్యారు. అయితే గంగాకుమారి ట్రాన్స్‌జెండర్ కావడంతో 2015 డిసెంబర్‌లో పోలీస్ అధికారులు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో గంగాకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ట్రాన్స్‌జెండరైన గంగాకుమారికి కానిస్టేబుల్ జాబ్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జలూరు పోలీస్ సూపరింటెండెంట్ గంగాకుమారిని కానిస్టేబుల్‌గా నియమించారు.

Ganga Kumari is The First Transgender Constable of Rajasthan Police.

Comments

comments