Search
Wednesday 23 May 2018
  • :
  • :

ఉద్యానవన క్షేత్ర పరిశీలన

shalva

మన తెలంగాణ/కుభీర్ : కుభీర్ మండలంలోని సిర్పెల్లి గ్రామంలో గల ఉద్యానవన క్షేత్రాన్ని గురువారం జిల్లా పాలనాధికారి ఇల్లంబరిది పరిశీలించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమిలో ఉద్యానవన పంటలను సాగుచేస్తుండగా ఈ క్షేత్రాన్ని సందర్శించిన పాలనాధికారి తను సాగుచేస్తున్న ఉద్యానవన పంటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన శాఖ తరపున పంటల సాగుకు కావలసిన సహాయ సహకారాల గురించి ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సాగు చేస్తున్న ఆపిల్ బేర్, జామ, సీతాఫలం, బొప్పాయి సాగుకు సంబంధించిన వివరాలను సంబంధిత రైతు మరియు అధికారులను అడిగి తెలుససుకున్నారు. సేంద్రియ పద్దతిలో సాగు చేసిన జామ, బొప్పాయి, ఆపిల్ బేర్ పండ్లను పరిశీలించిన కలెక్టర్ రైతును ప్రశంసించారు. ఉద్యానవన నిర్వాహకులు జిల్లా పాలనాధికారిని సన్మానించారు.

Comments

comments